Ad Code

స్తంభించిన ఇన్‌స్టాగ్రామ్ !


మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ స్తంభించిపోయింది. ఇన్‌స్టా అకౌంట్లలో యూజర్లు లాగిన్ కావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇన్‌స్టా అకౌంట్లలో యూజర్లు లాగిన్ కావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు రోజులుగా ఇన్‌స్టాలో లాగిన్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ రోజు (బుధవారం) కూడా డెస్క్ టాప్, మొబైల్ వెర్షన్‌ ఇన్‌స్టా సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. దాంతో చాలా మంది యూజర్లు తమ అకౌంట్లలో లాగిన్ కాలేకపోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ పనిచేయడం లేదని చాలామంది యూజర్లు ట్విట్టర్‌ వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు. ఇన్‌స్టా యాప్‌లో కూడా లాగిన్ కాలేకపోతున్నామని చెబుతున్నారు. ఇన్‌స్టా సర్వీసులు స్తంభించడాన్ని డౌన్‌డిటెక్టర్ కూడా ధృవీకరించింది. మే 25 (బుధవారం) ఉదయం 9:45 గంటల ప్రాంతంలో యూజర్లు లాగిన్ సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభించినట్లు డౌన్ డిటెక్టర్ ధ్రువీకరించింది. దాదాపు మధ్యాహ్నం 12:45 వరకు ఇన్ స్టా సర్వీసులు నిలిచిపోయాయి. ఢిల్లీ, జైపూర్, లక్నో, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో ఇన్ స్టా యూజర్లు లాగిన్ సమస్యలను ఎదుర్కొన్నారంటూ నివేదికలు వచ్చాయి. ఇన్ స్టా ప్లాట్ ఫాం ఓపెన్ చేసినప్పుడు Error (feedback_required) OK అనే మెసేజ్ డిస్ ప్లే అవుతోంది. కొంతమంది ఇన్‌స్టా యూజర్లలో యాప్ ఇన్‌స్టాగ్రామ్ ఎలాంటి అంతరాయం కలగలేదని తెలిపింది. కొంతమంది యూజర్లకు మాత్రం ఇన్‌స్టా ప్లాట్‌ఫారమ్‌ యాక్సస్ చేసుకోగలిగారని పేర్కొంది. అంతేకాదు.. లామంది యూజర్లు తమ అకౌంట్లలో లాగిన్ చేయడంతోపాటు ప్లాట్‌ఫారమ్‌లోని అన్నింటిని యాక్సస్ చేసుకోగలిగారని తెలిపింది. ఇన్ స్టాగ్రామ్ సర్వీసులు స్తంభించడంపై ఇప్పటివరకూ మెటా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదు.

Post a Comment

0 Comments

Close Menu