మగ ఎలుకలను భయపెడుతున్నఅరటిపండు !
Your Responsive Ads code (Google Ads)

మగ ఎలుకలను భయపెడుతున్నఅరటిపండు !


మగ ఎలుకలు అరటిపండ్లకు భయపడతాయని తాజా అధ్యయనంలో తేలింది. క్యూబెక్‌లో మాంట్రియల్‌లోని మెక్‌గిల్ యూనివర్శిటీ పరిశోధకులు అసాధారణ ఆవిష్కరణ చేశారు. గర్భిణీ, బాలింత ఎలుకల దగ్గరున్న మగ ఎలుకలలో ఒత్తిడి హార్మోన్ల పెరుగుదలను విశ్లేషించడానికి చేసిన అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గ్రహించారు. మగ ఎలుకల్లో హార్మోన్ల మార్పులు, ఆడవారి మూత్రంలో n-పెంటిల్ అసిటేట్ అనే సమ్మేళనం ఉండటం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తున్నట్లు. ఇక, ఇదే సమ్మేళనం అరటిపండ్లకు ప్రత్యేకమైన వాసనను కూడా ఇస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. సదరు అధ్యయన ఫలితాలు మే 20 న ‘సైన్స్ అడ్వాన్సెస్’ జర్నల్‌లో ప్రచురించారు. “ఈ ఫలితం మాకు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే, మేము దీని కోసం ప్రత్యేకంగా వెతకడం లేదు. మరో అధ్యయనంలో అనుకోకుండా ఈ విషయం బయటపడినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. గర్భిణీ ఎలుకల్ని మరొక ప్రయోగం కోసం మా ల్యాబ్‌లో ఉంచాము. వాటి దగ్గరున్న మగ ఎలుకలు వింతగా ప్రవర్తించడం ప్రారంభించినట్లు పరిశోధనలో ఓ గ్రాడ్యుయేట్ విద్యార్థి గ్రహించారు. ఈ అధ్యయనం సీనియర్ రచయిత, మెక్‌గిల్ విశ్వవిద్యాలయంలోని సైకాలజీ విభాగం ప్రొఫెసర్, జెఫ్రీ మొగిల్, లైవ్ సైన్స్‌తో అన్నారు. ఈ రీసెర్చ్ పేపర్‌లో, శాస్త్రవేత్తలు “మగ ఎలుకలు, ముఖ్యంగా కన్య పురుషులు, తమ జన్యుపరమైన సామర్థ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి శిశుహత్యల్లో దూకుడు ప్రదర్శిస్తాయి” అని పేర్కొన్నారు. వాటిని దూరంగా ఉంచడానికి గర్భిణీ, బాలింత ఎలుకలు కెమోసిగ్నలింగ్‌పై ఆధారపడతారు. అంటే శరీరాల ద్వారా రసాయన ప్రతిస్పందనలను విడుదల చేయడం, మగవారు తమ సంతానం దగ్గరికి రాకుండా సందేశాలు పంపడం జరుగుతుందన్నారు.ఆడవారి మూత్రంలో రసాయనాలకు ప్రతిస్పందనగా మగవారిలో ఒత్తిడి స్థాయిలు పెరగడాన్ని గమనించినప్పుడు, వేరే మూలం నుండి n-పెంటైల్ అసిటేట్ కూడా అదే ప్రతిస్పందనను ప్రేరేపిస్తుందా అని పరిశోధకులు ఆశ్చర్యపోయారు. అందుకని, వారు స్థానిక సూపర్ మార్కెట్ నుండి అరటి నూనెను పొందారు మరియు దానిని దూది బాల్స్‌లో వేసి మగ ఎలుకల బోనులో ఉంచారు. ఇది మగవారిలో ఒత్తిడి స్థాయిని పెంచిందని గుర్తించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog