Header Ads Widget

గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో కొత్తగా ఎనిమిది భారతీయ భాషలు


గూగుల్ ఈ ట్రాన్స్‌లేషన్ సర్వీసుకు సంస్కృతంతో సహా మరో 24 భాషలను జోడించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 133 భాషల్లో ఈ గూగుల్ ట్రాన్స్‌లేట్ అందుబాటులో ఉంది. 'కొత్తగా యాడ్ చేసిన భాషలను మాట్లాడేవారు ప్రపంచంలో 30 కోట్ల మంది వరకు ఉన్నారు. మిజో భాషను భారతదేశంలో ఎనిమిది లక్షల మంది మాట్లాడతారు. అలాగే లింగల భాష మాట్లాడే వారు సెంట్రల్ ఆఫ్రికాలో 4.5 కోట్ల మందికి పైగా ఉన్నారు.' అని గూగుల్ ట్రాన్స్‌లేట్ సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఐజాక్ కాస్వెల్ అన్నారు. గూగుల్ కొత్తగా యాడ్ చేసిన 24 భాషల్లో ఎనిమిది భారతీయ భాషలు కూడా ఉన్నాయి. డోగ్రీ, కొంకణి, అస్సామీస్, భోజ్‌పురి, మైథిలి, మణిపురి, మిజో, సంస్కృతం భాషలు ఈ జాబితాలో ఉన్నాయి. జీరో షాట్ మెషీన్ టెక్నాలజీ ద్వారా ఈ భాషలను యాడ్ చేశామని గూగుల్ తెలిపింది. కంపెనీ సాధించిన కొత్త టెక్నికల్ ఫీట్ ఇదే. అయితే ఈ ట్రాన్స్‌లేషన్ ఇంకా పర్‌ఫెక్ట్‌గా రాలేదని, దాని కోసం తాము ప్రయత్నిస్తామని పేర్కొంది.

Post a Comment

0 Comments