Ad Code

వాయు కాలష్యంతో అరిథ్మియా !


యురోపియన్‌ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ వార్షిక కాంగ్రెస్‌లో సమర్పించిన ఇటీవలి పరిశోధన ప్రకారం, వాయుకాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరిగేవారికి ప్రాణాంతకమైన హార్ట్ అరిథ్మియా వచ్చే ప్రమాదం ఉందని తేల్చారు. అరిథ్మియా అనేది గుండె సంబంధ వ్యాధి. గుండె వేగంగా లేదా అతినెమ్మదిగా కొట్టుకోవడం ఈ వ్యాధి లక్షణం. ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డీఫిబ్రిలేటర్ (ఐసీడీ) ఉన్న రోగులపై అధ్యయనం చేసిన పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చారు. ఐసీడీ లాంటి వెంట్రిక్యులర్ అరిథ్మియా ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులు రోజువారీ కాలుష్య స్థాయిలను తనిఖీ చేసుకోవాలని తమ అధ్యయనం సూచిస్తుందని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ అలెసియా జానీ తెలిపారు. 2.5 పీఎం (పర్టిక్యులేట్ మ్యాటర్‌), 10 పీఎం వాతావరణ కాలుష్యం ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండాలని, ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే ఎన్‌95 మాస్కు ధరించాలని ఆమె సూచించారు. ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ వాడితే మంచిదన్నారు. డబ్ల్యూహెచ్‌వో ప్రకారం బహిరంగ వాయు కాలుష్యం ప్రతి ఏటా 4.2 మిలియన్ల మందిని పొట్టనపెట్టుకుంటున్నదని తెలిపింది. దాదాపు ప్రతి ఐదుగురిలో ఒకరు వాతావరణ కాలుష్యం కారణంతో గుండె సంబంధ వ్యాధులతో మరణిస్తున్నారని పేర్కొంది. హై బీపీ, పొగాకు వినియోగం, పోషకాహార లోపంతో సంభవించే మరణాల తర్వాత ఈ మరణాలు నాలుగో స్థానంలో ఉన్నట్లు వివరించింది.


Post a Comment

0 Comments

Close Menu