జులై 1న నార్డ్ 2 టి విడుదల ?
Your Responsive Ads code (Google Ads)

జులై 1న నార్డ్ 2 టి విడుదల ?


మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను రిలీజ్ చేస్తున్న వన్‌ప్లస్.. నార్డ్ 2T  పేరుతో కొత్త ఫోన్‌ను రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఈ నార్డ్ సిరీస్ ఫోన్‌ లాంచింగ్‌ను కంపెనీ అధికారికంగా దృవీకరించింది. వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన టీజర్‌ను యాడ్ చేసింది. ఈ డివైజ్‌ను త్వరలో దేశంలో ఆవిష్కరిస్తామని అందులో పేర్కొంది. అయితే వన్‌ప్లస్ నార్డ్ 2T లాంచ్ డేట్‌ను ఇంకా వెల్లడించలేదు. కానీ తాజా డివైజ్‌ను జులై 1న మార్కెట్లోకి రిలీజ్ చేసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో నార్డ్ 2T ఫీచర్లను వెల్లడించింది. దీని స్పెసిఫికేషన్లు యూరోపియన్ మోడల్‌ను పోలి ఉంటాయి. ఇది ఫుల్ HD+ రిజల్యూషన్‌తో పనిచేసే 6.53-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌ AMOLED ప్యానెల్‌తో లాంచ్ కానుంది. ఈ స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ సపోర్ట్‌తో వస్తుంది. తాజా మిడ్ రేంజ్ డివైజ్‌లో స్టీరియో స్పీకర్లతో పాటు అలర్ట్ స్లైడర్ కూడా ఉంది. 5,000mAh యూనిట్‌కు బదులుగా 4,500mAh బ్యాటరీతో రానుంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ సామర్థ్యం ప్రస్తుతం OnePlus 10Rలో మాత్రమే అందుబాటులో ఉంది. కొత్త ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1300 SoC చిప్‌సెట్‌తో వస్తుంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీ IMX766 సెన్సార్, 8-మెగాపిక్సెల్ సోనీ IMX355 కెమెరా, 2-మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ దీని సొంతం. ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సోనీ IMX615 సెల్ఫీ కెమెరాను అందించారు. వన్‌ప్లస్ నార్డ్ 2T ప్రారంభ ధర రూ. 28,999గా (8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌) ఉంటుంది. ఈ ఫోన్ గ్రే, జేడ్ ఫాగ్‌ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. లాంచింగ్ ఆఫర్‌గా దీనిపై కంపెనీ రూ. 4,000 డిస్కింట్‌ ఆఫర్‌ అందిచే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog