Header Ads Widget

425 రోజుల వ్యాలిడిటీ తో బీఎస్ఎన్ఎల్ ధమాకా ఆఫర్ !


బీఎస్ఎన్ఎల్ ఒక సంవత్సరం కంటే ఎక్కువ వ్యాలిడిటీతో పాటుగా డైలీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఉచిత SMS సర్వీస్ వంటి ప్రయోజాలను అందించే బంపర్ అఫర్ ను ప్రకటించింది. ఈ ప్లాన్ కేవలం రూ. 797 కే  ప్రీపెయిడ్ ప్లాన్ వస్తుంది మరిన్ని లాభాలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ 425 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. రోజూ 2GB హై స్పీడ్ డేటా మరియు ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్ ను అన్ని నెటవర్క్ లకు కాలింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. అలాగే, రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది. అయితే, ఈ ప్లాన్ తో అందించే Freebies మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. ఇతర ఆఫర్లతో పాటుగా వచ్చే కాలర్ ట్యూన్ సర్వీస్ ఉచిత యాక్సెస్ మాత్రం ఈ ప్లాన్ కు వర్తించదు. మరో బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ ను కూడా బిఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం అఫర్ చేస్తోంది. అదే రూ.397 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ అఫర్ తో బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు కేవలం 397 రూపాయలకే పూర్తి 300 రోజుల వ్యాలిడిటీని అఫర్ చేస్తుంది.ఈ ప్లాన్ బడ్జెట్ ధరలో బెస్ట్ ప్లాన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమౌంట్ ని రోజుల లెక్కన లెక్కగడితే, రోజుకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఖర్చవుతుంది. ఈ అఫర్ ముందు నుండే అందుబాటులో వుంది మరియు BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ఆఫర్లలో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ ప్లాన్ తో మరిన్ని ఉచిత ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ ఈ 397 రూపాయల ప్రీపెయిడ్ అఫర్ రీఛార్జ్ చేసే వారికీ పూర్తిగా 300 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు, కస్టమర్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఈ అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత SMS మరియు డేటా లిమిటెడ్ డేస్ కోసం మాత్రమే. ఈ రీఛార్జ్ చేసే కస్టమర్లకు వ్యాలిడిటీ 365 రోజులు అంటే ఒక సంవత్సరం లభించినా, ఉచిత కాలింగ్, డేటా మరియు SMS సర్వీస్ లు మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Post a Comment

0 Comments