అమెజాన్ మాన్సూన్ కార్నివాల్ సేల్ లో సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. తాజాగా జరుగుతున్న ఈ లేటెస్ట్ సేల్ నుండి షియోమీ కొత్త 5g స్మార్ట్ ఫోన్ రెడ్మి నోట్ 10T 5g భారీ డిస్కౌంట్ తో పాటూ ఇతర ఆఫర్లతో కూడా లభిస్తోంది. ఈ అమెజాన్ సెల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.పది వేల లోపు మాత్రమే లభించడం గమనార్హం. రెడ్మి నోట్ 10 టి స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ బడ్జెట్ ఫ్రెండ్లీ 5g ప్రొసెసర్ డైమెన్సిటీ 700 SoC తో పాటూ 48MP ట్రిపుల్ కెమెరా వంటి చాలా ఆకర్షణీయమైన ఫీచర్లతో మన ముందుకు వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అమెజాన్ మాన్సూన్ కార్నివాల్ సేల్ నుండి మంచి ఆఫర్లతో అమ్ముడు పోవడం గమనార్హం. ఈ స్మార్ట్ ఫోన్ విడుదల అయినప్పుడు దీని ధర రూ.13,999 రూపాయలు కాగా.. రెడ్మి నోట్ 10T యొక్క 4జిబి, 64జిబి స్టోరేజ్ వేరియంట్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ సేల్ ద్వారా 2,000 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ.11,999 రూపాయలకే లభిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ పైన 500 రూపాయల కూపన్ అఫర్ ను కూడా మనకు అందించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, Citi బ్యాంక్ తో పాటు ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ అఫర్ ను కూడా పొందవచ్చు. . ఈ ఆఫర్లతో కొనేవారికి ఈ ఫోన్ 10 వేల కంటే తక్కువ ధరకే లభిస్తుంది అని చెప్పవచ్చు.
0 Comments