ఈవీ వాహనాలను ప్రభుత్వాలు ప్రోత్సహించడంతో ఎక్కువ మంది వినియోగదారులు ఈవీ వాహనాలపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ప్రముఖ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల తయారీపై ఫోకస్ పెడుతున్నాయి. ఈవీ వాహనాలు నడవాలంటే బ్యాటరీలను రీచార్జ్ చేయాల్సిందే.. ఇకపై సోలార్ ఆధారంగా నడిచే వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. నెదర్లాండ్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ లైట్ ఈయర్.. Lightyear 0 సరికొత్త సోలార్ కారును లాంచ్ చేసింది. సూర్యుడి నుంచి కాంతితో నేరుగా కారులోని లిథియం బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు. కారుపై భాగంలో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడం ద్వారా ఇంధనాన్ని అందించవచ్చు. సోలార్ కారు నడుస్తున్నంత సేపు బ్యాటరీ చార్జ్ అవుతూనే ఉంటుంది. కారులోని బ్యాటరీ ఫుల్ చార్జ్ ఏకంగా 625 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చునని కంపెనీ తెలిపింది. సోలార్ ప్యానెళ్లతో పాటు ప్లగ్ ద్వారా సైతం బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు. మరోవైపు కారులో నావిగేషన్, ఎంటర్‌నైట్‌మెంట్ స్పెషల్‌గా10 ఇంచుల టచ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. కారు ధర రూ.2కోట్లకుపైనే ఉంటుంది. ఈ ఏడాది చివరి వారంలో ప్రీ ఆర్డర్‌లు ప్రారంభం కానున్నాయి. రోజుకు సగటున 35 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఎండ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో 7 నెలల వరకు కారు నడుస్తుందని కంపెనీలు చెబుతున్నాయి. నెదర్లాండ్స్ తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే దేశాల్లో మూడు నెలల వరకు కారు నడుస్తుందని చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈవీ వాహనాల కన్నా సోలార్ కార్లకు ఎక్కువ డిమాండ్ పెరిగే అవకాశం కనిపిస్తోంది.
0 Comments