ఆపిల్ నుంచి శాంసంగ్ కు 80 మిలియన్ల డిస్‌ప్లే పానెల్స్‌ ఆర్డర్ ?


ఐ ఫోన్ 14 మొబైల్స్ తయారీకి శాంసంగ్ సంస్థ 80 మిలియన్ల OLED డిస్‌ప్లే పానెల్స్‌ను సరఫరా చేయనున్నట్లు కొరియాకు చెందిన ఓ మీడియా న్యూస్ నివేదిక లీకులిచ్చింది. ఈ ఏడాది యాపిల్‌కు శాంసంగ్ భారీ స్థాయిలో OLED డిస్‌ప్లే పానెల్స్‌ను సరఫరా చేస్తుంది. ఇందు కోసం శాంసంగ్ సంస్థ భారీ స్థాయిలో OLED డిస్‌ప్లే పానెల్స్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఏడాది మూడో త్రైమాసికానికి వాటిని యాపిల్‌కు డెలివరీ ఇవ్వనున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ డిస్‌ప్లేలు ఐ ఫోన్ 14 ప్రోతో పాటుగా ఐఫోన్ రెగ్యులర్ సిరీస్‌లకు కూడా వినియోగించనున్నట్లు సమాచారం. ఈ ఏడాది యాపిల్ ఐ ఫోన్ 14 సిరీస్‌లో నాలుగు మొబైల్స్ ను విడుదల చేయాలని కసరత్తులు చేస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. అందులో రెండు ఐ ఫోన్ 14, ఐ ఫోన్ 14 Max రెగ్యులర్ మోడల్స్ ఉండగా, మరో రెండు ప్రో మోడల్స్ ఐ ఫోన్ 14 Pro, ఐ ఫోన్  14 Pro Max లు ఉండనున్నాయి. ఈ రెండు రెగ్యులర్ మరియు ప్రో మోడల్ మొబైల్స్ 6.1 అంగుళాలు , 6.7 అంగుళాల డిస్‌ప్లే సైజులను కలిగి ఉండనున్నాయి. మొత్తం 80 మిలియన్ డిస్‌ప్లే పానెల్స్‌లో 38.17 మిలియన్ పానెల్స్ రెగ్యులర్ ఐఫోన్ మోడల్స్‌కు వినియోగించనున్నట్లు నివేదికలోని సమాచారం ద్వారా తెలిసింది. ఈ ఐ ఫోన్ 14 సిరీస్‌కు వినియోగించే డిస్‌ప్లే పానెల్స్ తయారీలో శాంసంగ్ TFT-based లో టెంపరేచర్ పాలిక్రిస్టలైన్ ఆక్సైడ్ , TFT-based లో టెంపరేచర్ పాలి సిలికాన్  ను ఉపయోగించనుంది. ఈ డిస్‌ప్లే పానెల్స్ తయారీ ప్రాజెక్ట్ చైనా కు చెందిన బీఓఈ సంస్థ చేపట్టాల్సి ఉందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ, డిజైన్ మార్పిడి సమస్యల కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి బీఓఈ సంస్థ ను తప్పించారు. ఐఫోన్ 14 ఈ ఏడాది సెప్టెంబర్‌లో మార్కెట్‌లో విడుదల కానున్నట్లు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇవి గొప్ప డిస్‌ప్లే పానెల్స్‌తో రానున్నట్లు అంచనాలు వేస్తున్నారు. దాదాపు ఐదేళ్ల తర్వాత యాపిల్ ఐఫోన్‌లో డిజైన్‌లో మార్పు చేస్తున్నట్లు సమాచారం.

Post a Comment

0 Comments