Ad Code

ఫేస్‌బుక్‌ను వీడనున్నషెరైల్ శాండ్ బర్గ్


మెటా సంస్థ అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో రెండో వారైన షెరైల్ శాండ్ బర్గ్ 14ఏళ్ల పదవీకాలం తర్వాత ఫేస్‌బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పదవికి గుడ్ బై చెప్పేయనున్నారు. 14 ఏళ్ల పదవీ కాలం తర్వాత ఫేస్‌బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పదవికి గుడ్ బై చెప్పేయనున్నారు. 52ఏళ్ల శాండ్‌బర్గ్ పదవికి తీవ్రమైన పోటీ రావడంతో ఆమె పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే మెటా సంస్థకు సంబంధించిన బోర్డులో సభ్యురాలిగా కొనసాగుతానని చెప్పారు. “ఆమె నాకు చాలా నేర్పింది. పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా నా జీవితంలో చాలా ముఖ్యమైన క్షణాల్లో తోడుగా ఉంది. షెరిల్‌తో కలిసి ఈ కంపెనీని నడపడం మిస్ అవుతున్నా” అని సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు. ఆన్‌లైన్ సోషల్ నెట్‌వర్క్ మెటావర్స్ రూపంలో ఇంటర్నెట్ కోసం చూసే వర్చువల్ విజన్ వైపు చూడటానికి రీబ్రాండ్ చేయడంతో శాండ్‌బర్గ్ రిటైర్మెంట్ వార్తలు బయటికొచ్చాయి. Facebook సోషల్ నెట్‌వర్క్‌లో సీనియర్ల సంఖ్య పెరుగుతుండటంతో TikTok, LinkedIn, Pinterest, Twitter, Appleలు కూడా ప్రజల ఆన్‌లైన్ దృష్టి ఆకర్షించడానికి Metaతో పోటీ పడుతున్నాయి. కంపెనీలో ఉండే శాండ్‌బర్గ్ పాత్ర ఎవరూ భర్తీ చేయలేరని, అయితే జేవియర్ ఒలివాన్ మెటా తర్వాతి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అవుతారని జూకర్‌బర్గ్ ప్రకటించారు. ఈ సారి సీఓఓ పద్ధతి వేరేలా ఉంటుందని ఆదేశాలు ఇవ్వడంలో శాండ్‌బర్గ్ కు ఉన్న అధికారం ఉండకపోవచ్చని జూకర్ బర్గ్ పేర్కొన్నారు. శాండ్‌బర్గ్ నిష్క్రమిస్తున్నారనే మాటతో మెటా షేర్లు రెండు శాతానికి పైగా పడిపోయాయి, కంపెనీ సాధారణ వృద్ధి చేరుకుంటుందా అనే ఆందోళనల్లో ఉన్నవారికి స్టాక్ విలువ పడిపోవడం మరో ఎదురుదెబ్బ.

Post a Comment

0 Comments

Close Menu