Ad Code

'బై నౌ పే లేటర్' !


యాపిల్ ఇప్పటికే ఆన్‌లైన్ సర్వీసులు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఇప్పుడు ఫైనాన్షియల్ సర్వీసెస్‌ ఇండస్ట్రీలో కూడా ప్రవేశం చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా 'బై నౌ పే లేటర్' అనే సర్వీస్‌ను అధికారికంగా ప్రకటించింది. యాపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌ 2022లో ఈ ఫైనాన్షియల్ సర్వీస్ గురించి వివరించింది. ఈ సర్వీసు ద్వారా నాలుగు ఈఎంఐల్లో పేమెంట్ చేసుకునే సదుపాయాన్ని ప్రజలకు అందిస్తామని పేర్కొంది. అయితే ఈ సర్వీస్ ప్రజలకు ఎలా హెల్ప్ అవుతుందనేది ఆసక్తిగా మారింది. కంపెనీ పేమెంట్‌ను ఎలా అందించాలని యోచిస్తోంది? రుణాలను ఎవరు అందజేస్తున్నారు? యాపిల్ ఏదైనా ఫైనాన్స్ సంస్థతో పార్ట్నర్‌షిప్ కుదుర్చుకోనుందా అనే సందేహాలు ఇప్పుడు అందరిలో మొదలయ్యాయి. ట్రిలియన్ డాలర్ల మార్కెట్ వ్యాల్యూ ఉన్న యాపిల్ కంపెనీ స్వయంగా రుణాలను అందించబోతున్నట్లు తేలింది. ఈ వ్యాపారాన్ని మేనేజ్ చేసేందుకు కంపెనీ ఓ అనుబంధ సంస్థను ఏర్పాటు చేయబోతోంది. ఈ అనుబంధ సంస్థ యాపిల్ పే ఎకోసిస్టమ్‌లో భాగంగా యూజర్ల క్రెడిట్‌ని చెక్ చేయడంతోపాటు, షార్ట్-టర్మ్ లోన్స్ ఆఫర్ చేస్తుంది. యాపిల్ పే లేటర్ అనే పేరిట వస్తున్న ఈ సర్వీస్ యాపిల్ పేని ఉపయోగించి ప్రొడక్ట్స్ కొనుగోలు చేసే యూజర్లకు ఆరు వారాలు లేదా 2 నెలలలోపు కట్టాల్సిన డబ్బును నాలుగు ఈఎంఐల్లో చెల్లించేలా వీలు కల్పిస్తుంది. యాపిల్ కంపెనీ యాపిల్ కార్డ్‌ అనే క్రెడిట్ కార్డ్‌ని సొంత క్రెడిట్ కార్డుని 2019లోనే యూజర్లకు పరిచయం. దీనిని ఫైనాన్షియల్ కంపెనీ గోల్డ్‌మ్యాన్‌ సాక్స్  పార్ట్‌నర్‌షిప్‌తో అందుబాటులోకి తెచ్చింది. అయితే నివేదికల ప్రకారం, ఇకపై ఏ విషయంలోనూ కంపెనీ గోల్డ్‌మ్యాన్‌పై ఆధారపడదు. గోల్డ్‌మ్యాన్‌తో సంబంధం లేకుండా రుణం మంజూరు చేయాలా వద్దా అనే నిర్ణయం సొంతంగా యాపిల్ తీసుకోనుంది. అలానే యూజర్లకు రుణాలను పంపిణీ చేయడానికి దాని సొంత నిధులలోని నగదును ఉపయోగించనుంది. ఐఓఎస్ 16 పబ్లిక్‌గా అందుబాటులోకి రాగానే యాపిల్ పే లేటర్ సర్వీసు ఈ ఏడాది చివర్లో లాంచ్ అవుతుంది. ప్రస్తుతానికి యూఎస్‌లో ఈ సర్వీస్‌ను యాపిల్ ఆఫర్ చేయనుంది. ఆ తర్వాత అన్ని దేశాల్లో సేవలను విస్తరించనుంది. యాపిల్ కార్డ్, యాపిల్ పే లేటర్‌తో, ఐఫోన్ తయారీదారు ఇకపై కేవలం హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజ్ మాత్రమే కాదని నిస్సంకోచంగా చెప్పవచ్చు. ఆర్థిక రంగంలో పెట్టుకున్న ఎన్నో ఆశయాలను నెరవేర్చడానికి ఆపిల్ సిద్ధమవుతోంది. మార్కెట్‌లో కంపెనీ వాల్యుయేషన్‌ పరిగణలోకి తీసుకుంటే యాపిల్ బ్యాంకింగ్ సెక్టార్‌లోకి ప్రవేశించడం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదని నిపుణులు అంటున్నారు. బై నౌ పే లేటర్ సర్వీసు గురించి మరిన్ని వివరాలు మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments

Close Menu