Ad Code

స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన టీసీఎల్


టీసీఎల్ బ్రాండ్ అమెరికాలో కొత్త స్మార్ట్ ఫోన్ స్టైలస్ 5జీ. పేరుతో లాంచ్ చేసింది. హ్యాండ్ రైటింగ్‌ను కచ్చితంగా గుర్తించే నెబో యాప్ కూడా ఇందులో ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.అమెరికాలో 258 డాలర్లుగా (సుమారు రూ.20,000) నిర్ణ యించారు. సింగిల్ లూనార్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో ఈ ఫోన్ లాంచ్ కానుందో లేదో తెలియరాలేదు. స్టైలస్ సపోర్ట్ ఉన్న ఫోన్ ఇంత తక్కువ ధరకు రావడం ఇదే ప్రథమం. ఇందులో 6.81 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20.5:9గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకోవచ్చు. కెమెరాల విషయానికి వస్తే ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై టీసీఎల్ స్టైలస్ 5జీ పనిచేయనుంది.

Post a Comment

0 Comments

Close Menu