సింపుల్ పాస్ వర్డ్ లు పెట్టకండి !
Your Responsive Ads code (Google Ads)

సింపుల్ పాస్ వర్డ్ లు పెట్టకండి !


సోషల్​ మీడియా​ అకౌంట్ మొదలు బ్యాంక్​ అకౌంట్ వరకు ప్రతి దానికి పాస్​వర్డ్​ పెట్టుకోవడం సర్వ సాధారణం. ఇతర దేశాలకు చెందిన నెటిజన్లతో పోలిస్తే ఇండియన్స్ పాస్​వర్డ్​ సెట్​ చేసుకోవడంలో వెనుకబడే ఉన్నారని గతంలో నార్డ్​ పాస్​ అనే సంస్థ తెలిపింది.  ఎక్కువ మంది తమ అన్ని సోషల్​ మీడియా అకౌంట్లకు ఒకే రకమైన పాస్​ వర్డ్​ పెట్టుకుంటున్నారని, లేదంటే సులువైన పాస్​వర్డ్​ సెట్​ చేసుకుంటున్నారని నివేదిక పేర్కొంది. తద్వారా, ఆయా పాస్​వర్డ్​లు సులభంగా హ్యాకర్ల చేతికి చిక్కుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది. చాలా మంది యూజర్లు తమ మొదటి పేరు, పుట్టిన తేదీ లేదా 123456 వంటివి పాస్​వర్డ్​గా పెట్టుకుంటున్నారని నార్డ్​ పాస్​ నివేదిక స్పష్టం చేసింది. భారతీయులే కాదు ప్రపంచ వ్యాప్తంగా 23 మిలియన్ల మంది యూజర్లు ఇదే పాస్​వర్డ్​ను కలిగి ఉన్నారని తెలిపింది. ఇక, '123456789' ప్రపంచంలో అత్యధిక మంది ఉపయోగించే రెండో పాస్​వర్డ్​గా నివేదిక వెల్లడించింది. ఈ రెండింటి తర్వాత picture 1 అనే పాస్​వర్డ్​ మూడో స్థానంలో ఉంది. ఎక్కువ సోషల్​ మీడియా యూజర్లు qwerty, password, dragon, and money, asdfghjkl, asdfgh, 147258369 వంటి సాధారణ పాస్‌వర్డ్‌లను కూడా ఉపయోగిస్తున్నారని నివేదిక పేర్కొంది. ఈ పాస్‌వర్డ్‌లను ఒక్క సెకనులోపే క్రాక్ చేయవచ్చని నివేదిక స్పష్టం చేసింది. భారతీయులు సాధారణంగా ఉపయోగించే పాస్‌వర్డ్‌ల విషయానికి వస్తే,. 12345, 123456, 123456789, 12345678, india123, 1234567890, 1234567, qwerty, abc123, iloveyou వంటివి ముందు వరుసలో ఉన్నాయి. ఈ పాస్‌వర్డ్‌లన్నింటినీ ఒక్క నిమిషంలోపే క్రాక్ చేయవచ్చని నివేదిక పేర్కొంది.  india123 మినహా, మిగతావన్నింటినీ కేవలం 17 నిమిషాల్లో క్రాక్ చేవయచ్చని తెలిపింది. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వ్యక్తులు తమ స్వంత పేర్లను పాస్‌వర్డ్‌లుగా ఉపయోగిస్తున్నారని నివేదిక పేర్కొంది. ఆశ్చర్యకరంగా, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వ్యక్తులు తమ పేర్లను, అభిమాన నటుల పేర్లను పాస్‌వర్డ్‌గా ఉపయోగిస్తున్నారని నివేదిక స్ఫష్టం చేసింది. హ్యాకర్ల చేర నుంచి మీ అకౌంట్లను కాపాడుకోవాలంటే, సైబర్‌ ఎటాక్‌ల నుండి సురక్షితంగా ఉండాలంటే బలమైన పాస్‌వర్డ్‌ను ఎంచుకోవడం చాలా అవసరమని నివేదిక గుర్తుచేస్తోంది. కనీసం 12 అక్షరాలు, అప్పర్​కేస్​ లెటర్స్​, లోయర్​ కేస్​ లెటర్స్​, నెంబర్స్, సింబల్స్​ కాంబినేషన్​తో సంక్లిష్టమైన పాస్‌వర్డ్‌లను సెట్​ చేసుకోవాలని​ సలహా ఇస్తుంది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog