Ad Code

యూట్యూబ్ లో ఛానెల్ క్రియేట్‌ చేయడం !


ఎప్పుడు, ఎక్కడ, ఏం చేస్తున్నాం అనే విషయాల్ని వీడియోలుగా చిత్రీకరించి Youtubeలో అప్‌లోడ్ చేయడం పరిపాటిగా మారింది. ఒక వ్యక్తిగత విషయాలే కాకుండా తమకు నచ్చిన ఇతరత్రా ఆసక్తికర అంశాలను కూడా వీడియోలుగా చిత్రీకరణ చేయడం మొదలైంది. ఇలా యూట్యూబ్ లో కంటెంట్ క్రియేషన్‌ తో ఖాతాదారులకు తమ వీడియో వ్యూస్‌ కు అనుగుణంగా ఆదాయం కూడా వస్తుండటం విశేషం. దీంతో Youtubeలో కంటెంట్ క్రియేటర్లకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. అయితే ఈ క్రమంలో కొందరు వీడియోలు తీసే ఆసక్తి ఉన్నప్పటికీ యూట్యూబ్‌లో అకౌంట్ తీయడం ఎలాగో తెలీక సతమతమవుతున్నారు. యూట్యూబ్‌లో ఛానెల్ క్రియేట్ చేసుకోవడం చాలా సులువైన ప్రక్రియ. మీరు కూడా యూట్యూబ్ లో ఛానల్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా Gmail లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ జీమెయిల్ సహాయంతో తో యూట్యూబ్ లో Sign in అవ్వాలి. యూట్యూబ్‌లోకి లాగిన్ అయిన తర్వాత మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు పలు రకాల ఆప్షన్స్ కనబడతాయి. వాటిలోనే రెండో ఆప్షన్ "Create a New Channel" అనే ఆప్షన్ కనపడుతుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి. "Create a New Channel" ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక విండో(బాక్స్‌) ఓపెన్ అవుతుంది. అందులో మీరు మీ ఛానల్ కి ఏ పేరు పెట్టాలనుకున్నారో ఆ పేరుని ఎంటర్ చెయ్యండి. దాంతో పాటు ఛానెల్ ప్రొఫైల్ పిక్చర్ ను అక్కడే అప్‌లోడ్ చేయండి. అంతే ఇక్కడితో మీ YouTube Channel క్రియేషన్ అయిపోతుంది. ఆ తర్వాత మీ ఛానెల్‌లో పూర్తి వివరాలు, ఛానెల్ ముఖ్య ఉద్దేశం ఏంటి అనే వివరాల్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం Customize Channel ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి. ఇప్పుడు మీ ఛానల్ కి ఒక Logo ఇవ్వండి. అక్కడే మీరు Channel Description ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఛానల్ గురించి వివరిస్తూ అంటే మీ ఛానల్ లో ఎటువంటి వీడియోలు అప్లోడ్ చెయ్యబోతున్నారు వంటి వివరాలు అన్నితెలియచేయండి. అలాగే మీ Gmail, Facebook , Twitter వంటి సోషల్ మీడియా పేజీలకు సంబందించిన లింక్స్ ని కూడా Add చేసుకోవచ్చు. మీ యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చు. ఇందుకోసం ఛానెల్‌లో కుడి వైపు పై భాగంలో + సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీ వీడియో ని యూట్యూబ్ లో అప్లోడ్ చెయ్యవచ్చు. Youtubeలో మీరు అప్‌లోడ్ చేసిన వీడియోలపై వ్యూస్ ఆధారంగా మీరు ఆదాయాన్ని పొందవచ్చు. ముందుగా మీకు ఇన్‌కం జనరేషన్ ప్రక్రియ ప్రారంభం కావాలంటే మీ ఛానెల్‌లోని వీడియోలన్నిటికీ కలిపి 4వేల గంటలకు పైగా వీక్షణ సమయం ఉండాలి. దాంతో పాటుగా 1000 మంది సబ్‌స్క్రైబర్ల ను మీ ఛానెల్ పొంది ఉండాలి. ఈ రెండు అర్హతలు ఉంటే మీరు యూట్యూబ్ నుంచి మానిటైజేషన్   ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి ముందు మనం యూట్యూబ్ కు మానిటైజేషన్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి. మనం రిక్వెస్ట్ పెట్టుకున్న కొద్ది రోజులకు Youtube సంస్థ మన కంటెంట్‌పై తనిఖీలు నిర్వహిస్తుంది. మనం పెడుతున్న కంటెంట్ కాపీ కంటెంటా లేదా స్వతహాగా తయారు చేసిందా అనే విషయాన్ని చూస్తుంది. ఇలా అన్ని అంశాల్లో మన ఛానెల్ పర్ఫెక్ట్‌గా ఉంది అనుకుంటే మన మానిటైజేషన్ రిక్వెస్ట్‌ను Youtube యాక్సెప్ట్ చేస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu