ఎల్జీ రోలబుల్ టీవీలు విడుదల !
Your Responsive Ads code (Google Ads)

ఎల్జీ రోలబుల్ టీవీలు విడుదల !


ఎల్జీ రోలబుల్ ఓఎల్ఈడీ టీవీ మరియు ఎల్జీ సిగ్నేచర్ ఓఎల్ఈడీ ఆర్ మోడల్ టీవీ స్వదేశీ మార్కెట్ లో విడుదలైంది. ఎంపిక చేయబడిన స్టోర్‌లలో వీటి అమ్మకాలు జరపనున్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి ఇవి ముంబయిలోని క్రోమా స్టోర్‌లో అమ్మకం జరుపుతున్నట్లు సంస్థ పేర్కొంది. అతి త్వరలో మరిన్ని అవుట్‌లెట్లలో వీటి అమ్మకాలు ప్రారంభించడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ రోలబుల్ టీవీలో ప్రధానంగా ఆకట్లుకునే అంశం ఏంటంటే.. మ్యూజిక్ ఒక్కటే వినాలనుకున్నప్పుడు టీవీని మడతబెట్టి సౌండ్ సిస్టమ్‌గా మర్చుకుని ఎంజాయ్ చేయవచ్చు. ఈ టీవీలో దృశ్యాలు రియల్ లైఫ్  అనుభూతిని కలిగిస్తాయి. అధునాతన టెక్నాలజీతో తయారు చేసిన ఈ టీవీ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే. దీని ధరను కంపెనీ రూ.75లక్షలుగా నిర్ణయించింది. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ హోం ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా డైరెక్టర్ హక్ హ్యున్ కిమ్ పలు విషయాలు వెల్లడించారు. ఈ రోలబుల్ టీవీ నిజంగా లగ్జరీ ప్రొడక్ట్ అని తెలిపారు. ఈ టీవీ వినియోగదారులకు అత్యుత్తమ అనుభూతిని కలిగిస్తుందని అన్నారు. 65 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ీడీ డిస్‌ప్లే కలిగి ఉంది. దీనికి సెల్ఫ్ లైటింగ్ పిక్సెల్ టెక్నాలజీని ఉజయోగించారు. దీనికి α9 Gen 4 (నాలుగో జనరేషన్‌) AI ప్రాసెసర్‌ను అందిస్తున్నారు. ఇక సౌండ్ విషయానికి వస్తే అద్భుతమైన యూజర్ అనుభూతి కోసం డాల్బీ ఆట్మోస్ స్పెషల్ ఫీచర్ కల్పిస్తున్నారు. కెంపెనీ తెలిపిన వివరాల ప్రకారం దీనికి డాల్బీ విజన్ ఐక్యూ ఫెసిలిటీ కల్పించారు. అంతేకాకుండా సెల్ఫ్ లైటింగ్ పిక్సెల్ టెక్నాలజీ ఈ టీవీ ప్రధాన ఆకర్షణ. అద్భుతమైన గేమింగ్ అనుభూతి పొందేలా ఈ టీవీ 4K 120fps and G-Sync సపోర్టుతో తయారుచేసినట్లు సంస్థ వెల్లడించడం విశేషం.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog