Ad Code

'నాయిస్' స్మార్ట్ గ్లాసెస్ !


దేశీయ ఆడియో, వేరబుల్ తయారీ సంస్థ నాయిస్ కూడా ఐ-గ్లాసెస్ రంగంలోకి దిగింది. ఈ కంపెనీ భారతదేశంలో తన తొలి స్మార్ట్ గ్లాసెస్ ఐ1ను తాజాగా విడుదల చేసింది. నాయిస్ ల్యాబ్స్‌లో అభివృద్ధి చేసిన ఈ స్మార్ట్ గ్లాసెస్ ప్రత్యేకమైన ఆడియో ఎక్స్‌పీరియన్‌ను అందజేస్తుందని కంపెనీ చెబుతోంది. నాయిస్ ఐ1 స్మార్ట్ గ్లాసెస్ రూ.5,999కి సొంతం చేసుకోవచ్చు.gonoise.com వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయవచ్చు. ఈ డివైజ్ లిమిటెడ్ ఎడిషన్‌గా మాత్రమే. నాయిస్ i1 స్మార్ట్ గ్లాసెస్ మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కాంపెన్సేషన్, కాలింగ్ కోసం మైక్రోఫోన్, మాగ్నెటిక్ ఛార్జింగ్, హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ కంట్రోల్ వంటి హైటెక్ ఫీచర్లతో లాంచ్ అయింది. ఇందులో ఆఫర్ చేసిన గైడెడ్ ఆడియో డిజైన్‌ అనేది చెవులలోకి మ్యూజిక్ సరిగ్గా వెళ్లేలా చేస్తుంది. ఈ గ్లాసెస్ చుట్టుపక్కల వస్తున్న అన్ని లౌడ్-సౌండ్స్‌ని బ్లాక్ చేసి, అద్భుతమైన ఆడియో ఎక్స్‌పీరియన్‌ను అందిస్తుంది. నాయిస్ i1 బ్లూటూత్ వెర్షన్ 5.1కి సపోర్ట్ చేస్తుంది కనుక ఓపెన్ చేయగానే మొబైల్ ఫోన్‌కి మిల్లి సెకన్లలో కనెక్ట్ అవుతుంది. యూజర్లు సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 9 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను పొందవచ్చు. విశేషమేంటంటే, ఈ స్మార్ట్ ఐవేర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. కేవలం 15 నిమిషాల ఛార్జ్‌తో యూజర్లు 120 నిమిషాల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను ఎంజాయ్ చేయవచ్చు.

ఈ స్మార్ట్ గ్లాసెస్‌లో మల్టీ-ఫంక్షనల్ టచ్ కంట్రోల్స్‌ కూడా కంపెనీ ఆఫర్ చేసింది. ఈ టచ్ కంట్రోల్స్‌తో కాల్స్‌ను లిఫ్ట్ చేయొచ్చు, కట్ చేయవచ్చు. అంతేకాదు టచ్ చేయడం ద్వారా మ్యూజిక్ మేనేజ్ చేయవచ్చు, వాయిస్ అసిస్టెంట్‌ను కూడా ఆన్ చేయవచ్చు. ఈ గ్లాసెస్‌తో ఆడియో ఎంజాయ్ చేస్తూనే యూజర్లు తమ కళ్లను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్‌, పీసీ, మొబైల్ మొదలైనవాటిని ఉపయోగించినప్పుడు కళ్లపై ఒత్తిడిని తగ్గించడానికి ఈ గ్లాసెస్‌ ఉపయోగపడతాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ చూస్తున్నప్పుడు క్లియర్ విజన్ అందించడానికి ఇందులో చక్కటి గ్లాసెస్ అందించారు. ఈ డివైజ్‌లో అందించిన బ్లూ లైట్ ఫిల్టరింగ్ ట్రాన్స్‌పరెంట్ లెన్స్‌లు యూజర్ల కళ్లను అన్ని లైట్స్, స్క్రీన్స్ నుంచి రక్షిస్తాయి. ఈ లెన్స్‌లు యూవీ కిరణాల నుంచి కూడా ప్రొటెక్షన్ అందిస్తాయని కంపెనీ చెబుతోంది. IPX4 రేటింగ్‌తో వాటర్-రెసిస్టెంట్, స్ప్లాష్-రెసిస్టెంట్‌గా ఈ ఇన్నోవేటివ్ గ్యాడ్జెట్ వస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu