అమెరికా డాక్టర్లు అరుదైన ఆపరేషన్ చేశారు. ఓ యువతికి త్రీడీ ప్రింటెడ్ చెవిని ట్రాన్స్ ప్లాంటేషన్ ద్వారా విజయవంతంగా అమర్చారు. ఆ యువతి లివింగ్ సెల్స్‌ను ఉపయోగించి ఈ చెవికి డాక్టర్లు రూపకల్పన చేశారు. త్రీడీ బయో థెరప్యూటిక్స్ అనే రీజనరేటివ్ మెడిసిన్ కంపెనీ తొలిసారిగా ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. మెక్సికోకు చెందిన అలెక్సాకి పుట్టుకతోనే కుడి చెవి చిన్నగా.. సరైన ఆకృతి లేకుండా ఉండేది. ఆ యువతి లివింగ్ సెల్స్ ఆధారంగా పేషెంట్‌కు సంబంధించిన త్రీడీ ప్రిటింగ్ చెవిని ఈ సంస్థ రూపొందించింది. ఇది విజయవంతం కావడంతో మైక్రోషియాతో బాధపడే మరింత మంది రోగులకు ఈ టెక్నాలజీని ఉపయోగించి కొత్త జీవితం ఇవ్వొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు.
త్రీడీ చెవి ట్రాన్స్‌ప్లాంటేషన్ !
0
June 07, 2022
Tags