Header Ads Widget

కొత్త బ్యాటరీ పై షావోమీ ఆఫర్ !


ఒరిజినల్ బ్యాటరీకి ఎక్కువ ఖర్చువుతుందని స్మార్ట్‌ఫోన్ యూజర్లు థర్డ్ పార్టీ బ్యాటరీలను కొంటుంటారు. షావోమీ తమ మొబైల్ యూజర్లకు అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా కేవలం రూ.499 నుంచే కొత్త బ్యాటరీ అందిస్తోంది. సాధారణంగా బ్యాటరీ మార్చాలంటే ఇంతకన్నా ఎక్కువ చెల్లిచాల్సి ఉంటుంది. కానీ షావోమీ బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా రూ.499 నుంచి బ్యాటరీలు మార్చుకునే అవకాశం అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్ మోడల్‌ను బట్టి బ్యాటరీ ధర ఉంటుంది. పాత స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నవాళ్లు తమ బ్యాటరీని తక్కువ ధరకే రీప్లేస్ చేయొచ్చు. మిగతా ఫోన్ మొత్తం బాగున్నప్పుడు బ్యాటరీ మార్చేస్తే ఇంకొన్ని రోజులు వాడుకోవచ్చు. అలాంటివారికి షావోమీ బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. షావోమీ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమకు దగ్గర్లో ఉన్న షావోమీ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి తక్కువ ధరకే బ్యాటరీ మార్చుకోవచ్చు. షావోమీ సర్వీస్+ యాప్‌లో అపాయింట్‌మెంట్ కూడా బుక్ చేయొచ్చు. ఒకసారి అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేసిన తర్వాత మీరు బ్యాటరీ మార్చుకోవాలనుకున్న స్మార్ట్‌ఫోన్ తీసుకెళ్లాలి. ఓ గంటలోపే బ్యాటరీ రీప్లేస్ చేసుకోవచ్చు. మార్కెట్లో థర్డ్ పార్టీ బ్యాటరీలను స్మార్ట్‌ఫోన్‌లో రీప్లేస్ చేయడం కొందరు మొబైల్ యూజర్లకు అలవాటు. కానీ థర్డ్ పార్టీ బ్యాటరీలతో ముప్పు తప్పదు. తక్కువ ధరకే ఒరిజినల్ బ్యాటరీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో కొత్త బ్యాటరీ రీప్లేస్ చేస్తే పదేపదే ఛార్జింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. బ్యాటరీ డౌన్ కావడానికి తక్కువ సమయం పడుతుంది. ఎలాంటి సందర్భాల్లో బ్యాటరీ మార్చాలన్న అనుమానం రావొచ్చు. స్మార్ట్‌ఫోన్ ఉబ్బినట్టు కనిపిస్తే బ్యాటరీ స్వెల్లింగ్ సమస్య కారణమని గుర్తించాలి. ఇలాంటి బ్యాటరీలతో ప్రమాదాలు తప్పవు. వెంటనే బ్యాటరీ మార్చడం మంచిది. ఇక మీరు 100 శాతం ఛార్జింగ్ పెట్టినా ఎక్కువగా వాడకముందే ఛార్జింగ్ తగ్గిపోతుందంటే బ్యాటరీలో సమస్య ఉన్నట్టే. మీరు ఫోన్ కొన్నప్పటి కన్నా ఇప్పుడు బ్యాటరీ పనితీరులో చాలా మార్పు కనిపించిందంటే బ్యాటరీ మార్చొచ్చు.

Post a Comment

0 Comments