Ad Code

ట్విట్టర్ ఉద్యోగులతో మస్క్ మీట్ !


టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మైక్రోసాఫ్ట్ బ్లాగ్ ట్విట్టర్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత తొలిసారిగా ట్విట్టర్ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. మస్క్ గురువారం జరిగిన అంతర్గత సమావేశానికి దాదాపు 10 నిమిషాలు ఆలస్యంగా హాజరయ్యారు. అది కూడా తన హోటల్ వంట గది నుంచి.. తాను మీటింగ్ హాజరైన సమయంలో బ్యాక్ గ్రౌండ్‌లో కిచెన్ స్పేస్ స్పష్టంగా కనిపించింది. అందులోనూ మస్క్ తన స్మార్ట్‌ఫోన్ ద్వారా సమావేశానికి లాగిన్ అయినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. మరో నివేదిక ప్రకారం మొత్తం సమావేశంలో మస్క్ ఇంటర్నెట్ కనెక్షన్ పదే పదే అంతరాయం కలిగింది. అతని ఆడియో కూడా సరిగా వినిపించలేదని నివేదిక తెలిపింది. ఎలన్ మస్క్ ట్విట్టర్ ఉద్యోగులను కలవడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో మస్క్ ఒప్పందం ఆఫర్ చేసినప్పటి నుంచి ట్విట్టర్ సిబ్బంది అడిగిన అనేక ప్రశ్నలను పరిష్కరించారు. ఈ సందర్భంగా మస్క్ ప్రసంగిస్తూ ఉద్యోగుల తొలగింపులు, వర్క్ ఫ్రమ్ హోం నుంచి ఆఫీసులకు తిరిగి రావడం, ట్విట్టర్‌లో యాడ్స్, మైక్రోబ్లాగింగ్ సైట్‌ను మరింత మెరుగుపరిచేందుకు తన మనస్సులో ఉన్న అనేక ఇతర భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించిన వివరాలను మస్క్ ఉద్యోగులతో పంచుకున్నాడు. మస్క్ ట్విటర్ టేకోవర్ చేసినప్పటి నుంచి కంపెనీ ఉద్యోగుల్లో ఒకటే ఆందోళన.. ఉద్యోగ భద్రత.. భవిష్యత్తులో ట్విట్టర్‌లో ఉద్యోగులను తొలగిస్తారని మస్క్ ప్రత్యేకంగా చెప్పలేదు. కంపెనీ ఆర్థికంగా ఎదగాలంటే మాత్రం ఖర్చును కూడా తగ్గించాలని బిలియనీర్ చెప్పారు. భవిష్యత్తులో ఉద్యోగాల కోత ఉండవచ్చని బహుశా సూచనగా కనిపిస్తోంది. ఉద్యోగుల కోతలో కొంత హేతుబద్ధీకరణ అవసరమని, లేదంటే భవిష్యత్తులో ట్విట్టర్‌ వృద్ధి చెందదని ఆయన అన్నారు. ఇందులో టెస్లా CEO అయినా కావొచ్చు.. సిగ్నిఫికేషన్ కంట్రిబ్యూటర్ అయిన ఎవరైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మస్క్ స్పష్టం చేశారు. ట్విట్టర్ ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు తిరిగి రావాలా అని అడిగిన ప్రశ్నను కూడా మస్క్ సమాధానమిచ్చాడు. ఆఫీసు నుంచి పని చేయడాన్నే తాను ఎక్కువగా ఇష్టపడతానని తెలిపాడు. అయితే.. అద్భుతమైన ట్విట్టర్ ఉద్యోగులు ఇంటి నుంచి పనిని కొనసాగించవచ్చని మస్క్ చెప్పారు. ఎవరైనా రిమోట్‌గా మాత్రమే పని చేయగలిగితే.. అలాంటివారిని ఉద్యోగంలో నుంచి తొలగించడం సమంజసం కాదని బిలియనీర్ సమావేశంలో వెల్లడించారు. ఈ నెల ప్రారంభంలో మస్క్ టెస్లా ఉద్యోగులకు రిమోట్ వర్క్ ఇకపై ఆమోదయోగ్యం కాదంటూ ఈమెయిల్ పంపారు. ఉద్యోగులు ఆఫీసులకు తిరిగి రావాలని లేదా ఉద్యోగాన్ని కోల్పోతారని ఆయన స్పష్టంగా చెప్పారు. రిమోట్ పని చేయాలనుకునే ఎవరైనా తప్పనిసరిగా వారానికి కనీసం 40 గంటలు టెస్లా నుంచి ప్రారంభం కావాలి.. ఉద్యోగులు పనిచేసే ఆఫీసు అనేది ఒక ప్రధాన టెస్లా ఆఫీసు అయి ఉండాలన్నారు. ఉద్యోగ విధులతో సంబంధం లేని రిమోట్ బ్రాంచ్ కార్యాలయం కాదన్నారు.

Post a Comment

0 Comments

Close Menu