సైబర్ నేరగాళ్ల సంఖ్య ఎక్కువగా పెరిగిపోయింది ముఖ్యంగా నకిలీ అకౌంట్ ల తో మోసాలకు పాల్పడుతున్నారు. ఫేస్ బుక్ అకౌంట్లు సృష్టించి వాటి ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పెడుతూ యాక్సెప్ట్ చేసిన తర్వాత అత్యవసరంగా డబ్బు కావాలి అని అడుగుతూ ఉంటారు. వారు చెప్పేది నిజమే అనుకొని ఎంతోమంది డబ్బులు పంపిస్తారు. పోలీసులకు ఫిర్యాదులు వీటిపైనే ఎక్కువగా ఉండడంతో వీటి పైన నిఘా ఉంచారు పోలీసులు. అయితే ఇలాంటి నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ను గుర్తించినప్పుడు వీటిని డిలీట్ చేసుకునే సదుపాయం కూడా వుంది. మీ పేరు పైన నకిలీ ఖాతా ఉన్నట్లు అయితే అకౌంట్ ని తొలగించుకోవచ్చు. దానిని డిలీట్ చేయాలంటే ముందుగా అకౌంట్ ని ఓపెన్ చేసి ప్రొఫైల్ ఫోటో కింద కుడివైపున మూడు చుక్కల మీద క్లిక్ చేయాలి. ఆ తరువాత ఫైండ్ సపోర్ట్ or రిపోర్ట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ ను ఎంపిక చేయాలి. అక్కడ ఎందుకు రిపోర్టు చేస్తున్నారో వాటి గురించి కొన్ని కారణాలను తెలుపవలసి ఉంటుంది. ఫేస్ బుక్ అకౌంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ రిపోర్ట్ ప్రక్రియను పూర్తి చేయాలి. మీరు మాత్రమే కాకుండా మీ స్నేహితులకు కూడా ఇదే విధంగా ఆ అకౌంట్ పై రిపోర్టు చేయించాలి. అప్పుడు మీ ఫేస్ బుక్ పరిశీలిస్తే నకిలీ ఖాతా ఉన్నట్లు అయితే డిలీట్ చేయడం జరుగుతుంది.
0 Comments