Ad Code

అంతరిక్షంలో ఒంటరిగా ఉన్న వ్యోమగామి !


40 ఏళ్ల క్రితం బ్రూస్ మెక్‌కాండెల్స్ II అనే వ్యోమగామి.. శాటిలైట్ రిపైర్ మిషన్‌ కోసం రిహార్సల్స్ చేస్తున్నాడు. దాని కోసం శాటిలైట్ వదిలేసి కనీసం స్పేష్ షిప్‌తో తాడుతో కనెక్షన్ కూడా లేకుండా.. అలా అంతరిక్షంలోకి వచ్చేశాడు. ఇలా కనీసం స్పేస్ క్రాఫ్ట్‌తో చిన్న కనెక్షన్ కూడా లేకుండా.. ఒక ఆస్ట్రోనాట్ అంతరిక్షంలో స్పేస్‌వాక్ చేయడం ఇదే మొట్టమొదటి సారి. ఇది 1984 ఫిబ్రవరిలో జరిగింది. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో ఉన్న బ్రూస్.. భూమి ఉపరితలానికి 170 మైళ్ల దూరంలో ఉన్నాడు. అంతేకాదు గంటకు 17,500 మైళ్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతున్నాడు. కానీ రోదసిలో ఉండే వర్చువల్ స్పేస్ వాక్యూమ్ కారణంగా అతనికి ఆ ఫీలింగ్ కూడా ఉండదట. దీనికి సంబంధించిన ఫొటోను ఇప్పుడు ఒక సైన్స్ ట్విట్టర్ హాండిల్.. నెట్టింట షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతోపాటు భయపడిపోతున్నారు కూడా. ''ఇంత కన్నా భయంకరమైన స్పేస్ ఫొటోను ఇప్పటి వరకూ చూడలేదు'' అని కొందరు అంటే.. ''ఈ ప్రపంచానికి దూరంగా ప్రశాంతంగా వెళ్లిపోవాలనుకునే వాళ్లు ఇంతకన్నా దూరం వెళ్లలేరేమో'' అంటూ మరికొందరు చమత్కరిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu