క్లౌడ్‌ఫ్లేర్ కంపెనీ సేవల్లో తీవ్ర అంతరాయం
Your Responsive Ads code (Google Ads)

క్లౌడ్‌ఫ్లేర్ కంపెనీ సేవల్లో తీవ్ర అంతరాయం


ఇంటర్నెట్, సర్వర్‌ ప్రొవైడర్‌ అయిన క్లౌడ్‌ఫ్లేర్ కంపెనీ సేవలకు మంగళవారం అంతరాయం కలిగింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులు సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ కంపెనీ నుంచి కొన్ని ప్రముఖ కంపెనీలు సేవలు పొందుతున్నాయి. పెద్ద ఎత్తున వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో వెంటనే క్లౌడ్‌ఫేర్‌ సంస్థ సమస్యను పరిష్కరించి, సేవలను పునరుద్ధరించింది. మిలియన్ల మంది వినియోగదారులు క్లైడ్‌షేర్‌ సేవలను వినియోగించుకోలేక ఇబ్బందులు పడ్డారు. మంగళవారం సమస్యను గుర్తించిన వెంటనే కంపెనీ ఓ ట్వీట్‌ ద్వారా వివరాలు తెలియజేసింది. క్లౌడ్‌ఫ్లేర్ అనేది కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్, సర్వర్ ప్రొవైడర్, కాబట్టి దాని సిస్టమ్‌లలో ఏదైనా క్రాష్ లేదా సమస్యలు ఉంటే, ఇంటర్నెట్‌లో ఎక్కువ భాగం ఎండ్‌ యూజర్‌కు అందుబాటులో ఉండదు. ఈ కంపెనీ సర్వర్‌లపై ఆధారపడిన వెబ్‌సైట్‌లు అన్నీ ప్రభావితం అవుతాయి. కేవలం ఇండియాలో ఉన్న వినియోగదారులు మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా సమస్యను ఎదుర్కొన్నారు. చాలా మంది వ్యక్తులు ప్లాట్‌ఫారమ్‌లలో ఎర్రర్ 500ని చూశారు, క్లౌడ్‌ఫ్లేర్ ఈ అంతరాయానికి కారణమైన సమస్యను వివరించింది. ప్రభావిత ప్రాంతాల్లో క్లౌడ్‌ఫ్లేర్ సైట్‌లను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న కస్టమర్‌లు 500 ఎర్రర్‌లను స్క్రీన్‌పై చూస్తారని, తమ నెట్‌వర్క్‌లోని అన్ని డేటా ప్లేన్ సేవలను ప్రభావితం చేస్తుందని క్లౌడ్‌ఫ్లేర్‌ స్పష్టం చేసింది. సమస్యను పరిష్కరించినట్లు కంపెనీ పేర్కొంది. వెబ్‌సైట్‌లు మళ్లీ అందుబాటులోకి వచ్చాయని, యథావిధిగా సేవలు కొనసాగుతాయని తెలిపింది. పరిష్కారాన్ని ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నట్లు కూడా పేర్కొంది. తద్వారా భవిష్యత్తులో మరోసారి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. క్లౌడ్‌ఫ్లేర్ హోస్ట్ చేసిన క్లయింట్‌ల ప్రకారం.. అమెజాన్ వెబ్ సర్వీసెస్, ట్విట్టర్, కాన్వా, షాపిఫై, జెన్‌షిన్ ఇంపాక్ట్ వంటివి, జనాదరణ పొందిన ఆన్‌లైన్ గేమ్‌లు కూడా యాక్సెస్ చేయలేని ప్రసిద్ధ వెబ్‌సైట్‌లలో ఉన్నాయి. డిస్కార్డ్, స్టీమ్, Google Duo సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ వారం ఇంటర్నెట్, వినియోగదారులపై క్లౌడ్‌ఫ్లేర్ స్వల్ప వ్యవధి అంతరాయం పెద్ద ప్రభావాన్నే చూపింది. ఎక్కువ మంది ఉపయోగిస్తున్న వెబ్‌సైట్‌లు కొన్నింటికి క్లౌడ్‌ఫ్లేర్‌ సేవలు అందిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం సమస్య తలెత్తిన వెంటనే చాలా మంది వినియోగదారులు ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున పోస్ట్‌లు చేశారు. వెబ్‌సైట్‌లు ఓపెన్‌ చేస్తుంటే ఎర్రర్స్ కనిపిస్తున్నాయని స్క్రీన్‌షాట్‌లను షేర్‌ చేశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog