Ad Code

డిజిటల్ లావాదేవీలు చేస్తున్నారా ?


మారుతున్న కాలానుగుణంగా ఎన్ని డిజిటల్ సేవలు వచ్చిన వాటిని వాడుకుని మోసాలకు పాల్పడే సైబర్ నెరగాళ్ళు పెరిగిపోయారు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఏటీఏం, బ్యాంకింగ్ సేవలు, పేమెంట్ పోర్టల్ సేవలను చాలా సులభతరంగ హ్యాక్ చేస్తున్నారు మోసగాళ్లు. గతంలో కనిపించకుండా జరిగే మోసాలు ఇప్పుడు నేరుగా ఫోన్ చేసి మరీ మోసాలకు పాల్పడుతున్నారు. వారిని కంట్రోల్ చేయడం కంటే వారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలని మేధావులు అంటున్నారు. సైబర్ నేరగాళ్ళు పాత పద్ధతులు మానేసి కొత్త దారిలో నేరాలకు పాల్పడుతూ సైబర్ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రతీ ఆర్గనైజేషన్ వారి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇండియాలో సాధారంగంగా బ్యాంక్ అధికారి, ఈ వ్యాలెట్ ప్రోవైడర్స్, టెలికం సర్వీస్ ప్రొవైడర్స్ లా ఫోన్ చేసి బ్యాంక్, ఏటీఏం నెంబర్లు సేకరిస్తారు. బాధితులను మాయ చేసి వివరాలు సేకరిస్తారు. కార్డు అప్డేట్ చేయాలని, బ్యాంక్ అకౌంట్ ను అన్ బ్లాక్ చేయాలని, మీ అకౌంట్ లో అమౌంట్ జమ అవుతుందని ఏటీఏం పనిచేయదని, సిమ్ కార్డ్ యాక్టివేషన్ కోసం అని వివిధ రకాల అబద్దాలు చెప్పి ప్రజల నుండి సమాచారం సేకరిస్తారు. ఓటీపీ నెంబర్ కూడా తీసుకుని క్షణాల్లో అమౌంట్ కాజేస్తున్నారు. ఈ పద్దతిలో అధికారిక పోలీస్, బ్యాంక్ అధికారుల మాదిరిగా వెబ్సైట్లు సృష్టిస్తారు. వాటి నుండి మెయిల్స్ వచ్చేలా ప్లాన్ చేస్తారు. వాళ్లు పంపిన లింక్ క్లిక్ చేసినా, వారు పంపిన యాప్స్ డౌన్ లోడ్ చేసినా వెంటనే వివరాలు సేకరించి అమౌంట్ కాజేస్తారు. సోషల్ మీడియాలో తప్పుడు బ్యాంక్ నంబర్లు ప్రచారం చేస్తారు వాటికి ఫోన్ చేసినా మీ అమౌంట్ కు గ్యారెంటీ లేదు. గత సంవత్సరం అత్యధికంగా జరిగిన నేరాలు నెలలో రెండో, నాలుగో శుక్రవారం జరిగాయి. మొబైల్ యాప్ ల ద్వారా అధిక మందితో డబ్బు కొట్టేశారు నేరగాళ్ళు. గత సంవత్సరం 27 ఆర్బీఐ వార్షిక నివేదికలో జాతీయ బ్యాంక్ లు డిజిటల్ బ్యాంక్ లపై బాగా ప్రచారం చేశాయి. సైబర్ నెరగాళ్ళకు ఇది మంచి అవకాశంగా ఏర్పడింది. లాక్ డౌన్ సమయంలో కూడా డిజిటల్ లావాదేవీల పేరిట నేరగాళ్ళు అధికంగా సైబర్ నేరాలకు పాల్పడ్డారు. కేవలం 2022 లో మాత్రమే రూ.1.38 ట్రిలియన్ నగదును నేరగాళ్ళు కాజేశారని బ్యాంక్ లు చెప్పాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ లో రూ.36,342 కోట్ల విలువైన నగదు అవకతవకలు జరిగాయని బ్యాంక్ లు పేర్కొన్నాయి.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బ్యాంక్ లు ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. ఎవరైనా ఫోన్ చేసి వ్యక్తిగత సమాచారం అడిగితే చెప్పొద్దని అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఖాతాదారులకు ఫోన్ మెసేజ్ లు పంపుతున్నారు బ్యాంకర్లు. బ్యాంక్ లు ఎప్పుడు వ్యక్తిగత సమాచారం అడగవని అడిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. తెలియని మెయిల్స్ ఓపెన్ చేయొద్దని, తెలియని లింక్ లను కూడా క్లిక్ చేయొద్దని ఖాతాదారులకు తెలియజేస్తున్నారు. అధికారిక యాప్స్ అయితే డౌన్ లోడ్ చేయాలని, కవ్వించే ఆఫర్లను నమ్మి అనౌసరమైన లింక్ లను క్లిక్ చేయొద్దని అవగాహనా కల్పిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu