Header Ads Widget

హాట్ కేకుల్లా అమ్ముడైన నథింగ్ ఫోన్ 1


ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం నథింగ్ ఫోన్ 1 దేశీయ మార్కెట్లో లాంచ్ కాగానే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. మొదటి ప్రీ-ఆర్డర్ సేల్ సమయంలో నిముషాల్లోనే నథింగ్ ఫోన్ 1 స్టాక్ అయిపోయింది. చాలా మంది ఆసక్తిగల కస్టమర్‌లు ఈ ఫోన్‌ను ముందస్తుగా బుక్ చేసుకోలేక నిరాశకు గురయ్యారు. ఆసక్తి గల కస్టమర్ల కోసం నథింగ్ ఇండియా ప్రెసిడెంట్ జనరల్ మేనేజర్ మను శర్మ నథింగ్ ఫోన్ 1 ప్రీఆర్డర్లను అందిస్తున్నట్టు తెలిపారు. జూలై 18న  సెకండ్ రౌండ్ ప్రీ-ఆర్డర్ సేల్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. సెకండ్ ప్రీ-ఆర్డర్ సేల్స్ బుకింగ్ మొదలయ్యాయని ఆయన ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి నథింగ్ ఫోన్ 1ని బుక్ చేసుకోవచ్చు. నథింగ్ ఫోన్ 1ని త్వరగా బుక్ చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే స్టాక్ కేవలం నిమిషాల్లోనే స్టాక్ అయిపోతుంది. ఇప్పుడు, ప్రీ-ఆర్డర్ సేల్ వ్యవధిని జూలై 19 నుంచి జూలై 20 అర్ధరాత్రి వరకు పొడిగించారు. నథింగ్ ఫోన్ 1 జూలై 21న సాయంత్రం 7 గంటల నుంచి ఓపెన్ సేల్‌కు అందుబాటులో ఉంటుంది. కొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

Post a Comment

0 Comments