Ad Code

ఐక్యూ 10 సిరీస్‌ నుంచి కొత్త ఫోన్ల విడుదల !


ఐక్యూ 10 సిరీస్‌ నుంచి కొత్తగా ఐక్యూ 10 , ఐక్యూ 10 ప్రో మోడళ్లు చైనాలో తాజాగా లాంచ్ అయ్యాయి. వీటిలో ఐక్యూ 10 ప్రో వేరియంట్ హై లెవల్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని కంపెనీ వెల్లడించింది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఈ సెటప్ 8K వీడియోను రికార్డ్ చేయగలదు. దీంతోపాటు 14.6-మెగాపిక్సెల్ 3x టెలిఫోటో కెమెరా, 50-మెగాపిక్సెల్ 150-డిగ్రీ అల్ట్రా వైడ్ సెన్సార్‌ ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఫోన్ 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 100% DCI-P3 రేటింగ్‌ దీని సొంతం. అంటే ఇది RGB కలర్ స్పేస్ మొత్తం స్పెక్ట్రమ్‌ను కవర్ చేస్తుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC చిప్‌తో పనిచేస్తుంది. ఇది గేమింగ్ అవసరాల కోసం ఫ్రేమ్ రేట్లను పెంచడానికి ఇంటర్‌పోలేషన్‌ను ఉపయోగిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ చిప్‌సెట్ డివైజ్‌లో పవర్‌ను కూడా నియంత్రిస్తుంది, ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుతుంది. ఈ ఫోన్‌లో 12GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్‌లో 4700mAh బ్యాటరీ ఉంటుంది. ఇది రెండు సెల్స్‌గా డివైడ్ అయ్యి ఉంటుంది. ఇది ఏకంగా 200W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది కేవలం 10 నిమిషాల్లోనే ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేస్తుందని ఐక్యూ తెలిపింది. ఇది 65W వరకు USB పవర్ డెలివరీ ఛార్జ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, అలాగే రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఫోన్ స్టాండర్డ్ వేరియంట్ ఐక్యూ 10 కూడా స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్‌లో రన్ అవుతుంది.. అదే మెమరీ, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లతో లభిస్తుంది. ఈ డివైజ్‌లో కూడా 4700mAh స్ప్లిట్ బ్యాటరీ ఉంటుంది. అయితే ఇది 120W ఛార్జింగ్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. గ్లోబల్ మార్కెట్లో వీటి లాంచింగ్‌పై స్పష్టత లేదు.

Post a Comment

0 Comments

Close Menu