Ad Code

జులై 12న నథింగ్‌(1) ఫోన్ విడుదల ?


నథింగ్ ఫోన్(1)ను మొదట ఇన్వైట్‌ ఓన్లీ సిస్టమ్‌ ద్వారా మాత్రమే ఇండియాలో విక్రయించనున్నారు. ఫోన్‌ కొనాలనే ఆసక్తి ఉన్నవారు లాంగ్‌వెయిటింగ్‌ లిస్ట్‌లో వెనకబడకుండా ఉంటేనే ఇన్వైట్‌ కోడ్‌ను పొందే అవకాశం ఉంటుంది. ఫోన్ కోసం రీఫండబుల్ రూ.2000 ప్రీ-బుకింగ్ పాస్‌ను కొనుగోలు చేయడానికి ఈ ఇన్వైట్‌ కోడ్‌ని ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఉపయోగించవచ్చు. దీంతో జులై 12న ఫోన్ లాంచ్ అయిన తర్వాత ఫోన్‌ అందుకునే వ్యక్తుల్లో మొదట ఉంటారు. అయితే ట్విట్టర్ టిప్‌స్టర్ ముకుల్ శర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు నథింగ్ ఫోన్(1) ప్రీ-ఆర్డర్ పాస్ ఇన్వైట్‌-కోడ్ లేకుండా వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఇన్వైట్‌ కోడ్ కోసం సెర్చ్‌ చేస్తే, కచ్చితంగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని ముకుల్‌ శర్మ తెలిపారు. కానీ ఫ్లిప్‌కార్ట్ అకౌంట్‌లో ఇప్పుడే కొనుగోలు చేసే అవకాశం లేదని చెప్పారు. ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్ ప్రకారం వినియోగదారులు జులై 3 వరకు వెయిట్‌లిస్ట్‌లో చేరే అవకాశం ఉంది. దీనికి సంబంధించి జులై 7న మరికొంత సమాచారం అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. అయితే పాస్‌లను ఫ్లిప్‌కార్ట్‌ అందరికీ విక్రయిస్తే.. ఇప్పటికే ఇన్వైట్‌ కోడ్‌ పొందినవారి పరిస్థితి ఏంటనే అంశంపై స్పష్టత లేదు. అదే జరిగితే ఇన్వైట్‌ కోడ్‌ కోసం సైన్ అప్ చేసిన వినియోగదారులు నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం నథింగ్‌ వెబ్‌సైట్‌లో ప్రీ-ఆర్డర్ ఇన్వౌట్‌ కోడ్ కోసం సైన్ అప్ చేయడానికి ఇకపై వినియోగదారులకు అవకాశం లేదు. నథింగ్‌ ఫోన్‌(1) జులై 12న లాంచ్‌ కాకముందే.. అధికారికంగా లేదా లీక్‌ల ద్వారా చాలా వివరాలు బయటకు వచ్చాయి. ఇందులో 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల OLED స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 778G+ చిప్‌సెట్, ఫోన్ వెనుక 50MP+16MP డ్యూయల్ కెమెరా సెటప్, 45W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4,500mAh బ్యాటరీ ఉన్నాయి. ప్రీ-ఆర్డర్ పాస్ ఉన్న వినియోగదారుల కోసం లాంచ్ రోజున అంటే జులై 12 విక్రయిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రీ-ఆర్డర్ పాస్ ఉన్న వినియోగదారులు లాంచ్ చేసిన వెంటనే ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. పాస్ మొత్తానికి ఫోన్‌పై రూ.2 వేలు డిస్కౌంట్‌ లభిస్తుంది. ఫోన్‌ని కొనుగోలు చేయకూడదని నిర్ణయించుకున్న వినియోగదారులు పాస్‌ కోసం వెచ్చించిన మొత్తాన్ని వాపసు పొందవచ్చు. ఫోన్(1)తో పాటుగా న్యూ వేరియంట్‌ ఇయర్(1) TWS ఇయర్‌బడ్‌లను ప్రారంభించాలని నథింగ్‌ కంపెనీ భావించింది. కొత్త ఇయర్‌బడ్‌లు స్క్వేర్‌ షేప్‌లో కాకుండా కొత్త స్టిక్-షేప్‌లో ఉంటాయి. కొద్దిగా డిజైన్ కూడా మారుతుంది

Post a Comment

0 Comments

Close Menu