ఐఫోన్ 14 ప్రో సేల్స్ పెంచేందుకు భారీ కసరత్తు !
Your Responsive Ads code (Google Ads)

ఐఫోన్ 14 ప్రో సేల్స్ పెంచేందుకు భారీ కసరత్తు !


సెప్టెంబర్ నెలలో ఈ కొత్త ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ చేసే అవకాశం ఉంది. గత ఏడాదిలో ఐఫోన్ 13 లాంచ్ అయింది. ఐఫోన్ 14 నెక్స్ట్ ఐఫోన్ మోడల్ వస్తుందంటూ ఇప్పటికే లీక్‌లు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఐఫోన్ 14 మోడల్స్ వివరాలు, లాంఛ్ డేట్‌పై యాపిల్ అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడించకముందే ఈ మోడల్స్ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌పై పలు లీకులు వెల్లడయ్యాయి. ఇక యాపిల్ తన సేల్స్ వ్యూహాన్ని మారుస్తోందని తాజా నివేదిక ముందుకొచ్చింది. సూపర్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్‌ను విస్తరించే క్రమంలో హైఎండ్ ఐఫోన్ 14 ప్రొ సేల్స్‌పై యాపిల్ దృష్టి సారించనుందని టీఎఫ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ అనలిస్ట్ మింగ్‌- చి కూ వెల్లడించారు. ఇది వన్‌టైం ప్లాన్ కాదని, ఐఫోన్ 15 సిరీస్ సహా రాబోయే ఐఫోన్ మోడల్స్‌కూ ఇదే వ్యూహం అనుసరిస్తుందని కూ పేర్కొన్నారు. ఈ ఏడాది లాంఛ్ కానున్న ఐఫోన్ ప్రొ మోడల్స్ చవకైన మోడల్స్ కంటే విభిన్న లుక్‌లో ఉంటాయని చెబుతున్నారు. ఈ సెప్టెంబర్‌లో యాపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్‌, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్‌లను లాంఛ్ చేస్తోంది. ఈ మోడల్స్ పిల్ షేప్‌డ్ డిజైన్‌తో ఆకట్టుకుంటాయని లీకుల్లో వెల్లడైంది. ఈ నాలుగు మోడల్స్ ఏ16 బయోనిక్ చిప్‌సెట్‌తో ఐఓఎస్ 16 ఓఎస్‌పై రన్ అవుతాయి. ఐఫోన్ 13 మాదిరిగానే.. 6.1-అంగుళాల డిస్‌ప్లేతో రానుంది. మొదటిసారిగా AMOLED ప్యానెల్‌తో రానుంది. ఈ ఏడాదిలో 'మినీ' మోడల్ లేదా ఐఫోన్ 14 మినీ ఉండే అవకాశం లేదు. ఐఫోన్ మినీ మోడల్‌ను నిలిపివేయడానికి సంబంధించిన వివరాలను Apple వెల్లడించలేదు. ఐఫోన్ SE మోడల్స్‌పై సేల్ ప్రభావం పడింది. మినీ మోడల్‌ను నిలిపివేయాలని కంపెనీ యోచిస్తోందని కంపెనీ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఐఫోన్ 14 మినీ, ఐఫోన్ 14 మ్యాక్స్‌తో రానుంది. ఆపిల్ ఐఫోన్ ప్రో మోడల్స్ నుంచి కొన్ని ఫీచర్లను ప్యాక్ చేస్తుందని భావిస్తున్నారు. అయితే సరసమైన ధరకే రానుందని అంచనా.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog