ఒప్పో రెనో 8, రెనో 8 ప్రో లాంచ్ తేదీని అధికారికంగా ధృవీకరించారు. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ జూలై 18న సాయంత్రం 6 గంటలకు అధికారికంగా అందుబాటులోకి రానుంది. లాంచ్ ఈవెంట్ కంపెనీ వెబ్‌సైట్‌తో పాటు సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్‌లలో లైవ్ ఈవెంట్ జరుగనుంది. చైనాలో ఈ సిరీస్‌లో Oppo Reno 8, Oppo Reno 8 Pro, Oppo Reno 8 Pro Plus మూడు మోడల్ స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. భారత్ Oppo Reno 8, Oppo Reno 8 Pro అనే రెండు మోడళ్లలో మాత్రమే రానుంది. భారత మార్కెట్లో రెనో 8 ప్రో, రెనో 8 ప్రో ప్లస్ రీబ్రాండెడ్ వెర్షన్‌గా వచ్చే అవకాశం ఉంది. ఒప్పో రెనో 8 6.43-అంగుళాల పూర్తి-HD+ AMOLED డిస్‌ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్‌తో రానుంది. MediaTek డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌తో పాటు 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పనిచేస్తుంది. భారత మార్కెట్లో ఈ ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్, 8GB RAM + 256GB, 12GB RAM + 256GB స్టోరేజ్ మూడు వేరియంట్‌లలో రానుందని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్ 12-ఆధారిత ColorOS 12.1 స్కిన్‌తో రన్ అవుతుంది. Reno 8 4500mAh బ్యాటరీతో రానుంది. నార్డ్ 2T మాదిరిగానే బాక్స్‌లో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. కెమెరా ముందు భాగంలో.. రెనో 8లో మారిసిలికాన్ X చిప్, వెనుక భాగంలో 50-MP ప్రైమరీ కెమెరా, 2-MP B&W సెన్సార్, 2-MP మాక్రో షూటర్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియోల కోసం.. ఫోన్ ముందు భాగంలో 32-MP కెమెరాతో రానుంది. ఒప్పో రెనో 8 Pro ఫోన్ ఇటీవల చైనాలో లాంచ్ అయింది. ఒప్పో రెనో 8 Pro Plusకి అందించిన స్పెషిఫికేషన్లలో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, MediaTek డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ప్రాసెసర్ రానుంది. గరిష్టంగా 12GB RAM, 256GB స్టోరేజీ, Android 12-ఆధారిత ColorOS 12.1 స్కిన్, 4,500mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, MariSilicon X-పవర్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో రానుంది. రెనో 8 సిరీస్ ధరను ఇంకా వెల్లడించలేదు. కానీ, లీక్‌లు ఇప్పటికే ధరలను లీక్ చేశాయి. లీక్‌ల ప్రకారం.. రెనో 8 సిరీస్ రూ. 29,990 నుంచి ప్రారంభమై రూ. 33,990 వరకు ఉంటుంది. రెనో 8 ప్రో ఖరీదైనదే. రూ. 42,900 నుంచి లాంచ్ అవుతుందని అంచనా. రెండు మోడల్‌లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. బ్యాంక్ ఆఫర్‌లు కూడా అందిస్తోంది.
జూలై 18న ఒప్పో రెనో 8 సిరీస్ విడుదల
0
July 05, 2022
Tags