Ad Code

రియల్‌మీ ట్యాబ్లెట్ రూ.18 వేల లోపే!


దేశీయ మార్కెట్లో రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ ట్యాబ్లెట్లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్ పనిచేయనుంది. రియల్‌మీ లాంచ్ చేసిన మొదటి 5జీ ట్యాబ్లెట్ ఇదే కావడం విశేషం. ట్యాబ్లెట్ వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. క్వాడ్ స్పీకర్ సెటప్ కూడా ఇందులో ఉంది. దీని ధరను మనదేశంలో రూ.19,999గా నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. ఇది వైఫై కనెక్టివిటీని సపోర్ట్ చేయనుంది. 5జీ ఫీచర్ సపోర్ట్ చేసే మోడల్ ధర రూ.25,999గా ఉంది. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో 5జీ సపోర్ట్ చేసే మోడల్ ధర రూ.27,999గా ఉంది. గ్లేసియర్ బ్లూ, గ్లోయింగ్ గ్రే రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీని సేల్ ఆగస్టు 1వ తేదీ నుంచి జరగనుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ.కాం, ఆఫ్‌లైన్ రిటైల్ చానెళ్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల ద్వారా దీన్ని కొనుగోలు చేస్తే రూ.2,000 తగ్గింపు లభించింది. అంటే రూ.17,999కే దీన్ని కొనేయచ్చన్న మాట. ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఫర్ ప్యాడ్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది. ఇందులో 11 అంగుళాల 2కే డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ద్వారా మరో 5 జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ట్యాబ్లెట్ వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ముందువైపు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ద్వారా వీడియో కాల్స్ చేసుకోవచ్చు, సెల్ఫీలు తీసుకోవచ్చు. దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ 105 డిగ్రీలుగా ఉంది. 128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఇందులో ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. స్మార్ట్ కీబోర్డు, రియల్‌మీ మ్యాగ్నటిక్ స్టైలస్‌ను కూడా ఈ ట్యాబ్ సపోర్ట్ చేయనుంది. అయితే వీటిని ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. నాలుగు స్పీకర్లు ఈ ట్యాబ్‌లో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 8340 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.

Post a Comment

0 Comments

Close Menu