Ad Code

మ్యాక్‌బుక్ ఎయిర్ ఎమ్2 ల్యాప్‌టాప్ సేల్ ప్రారంభం !


ఆపిల్ బ్రాండ్  ఈ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎమ్2 ల్యాప్ టాప్ జూలై 15 నుంచి సేల్‌కు వచ్చింది. కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్ ఈ ఏడాది జూన్‌లో లాంచ్ అయింది. Apple ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. అమెజాన్‌లో ఈ ల్యాప్‌టాప్ ఇంకా లిస్టు కాలేదు. అయితే ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ అందుబాటులో ఉండనుంది. MacBook Air M2 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 1,19,900 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంటుంది. ఇక యూజర్లు గరిష్టంగా మ్యాక్ బుక్ ఎయిర్ M2లో 24GB RAM, 2TB స్టోరేజ్‌తో మెషీన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. మ్యాక్‌బుక్ ఎయిర్ M2 పాత మోడల్ కన్నా ఎక్కువ ధరతో వస్తోంది. 2020 మోడల్‌ని కొనుగోలు చేయాలా లేదా కొత్తది కొనుగోలు చేయాలా? అనేది యూజర్ ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్ కొత్త డిజైన్‌తో వచ్చింది. కటింగ్ బెజెల్స్‌తో పెద్ద డిస్‌ప్లేను అందిస్తుంది. Apple లేటెస్ట్ మరింత శక్తివంతమైన M2 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. హై-ఎండ్ 13-అంగుళాల MacBook Pro 2022 మోడల్‌కు కూడా అందిస్తుంది. మ్యాక్ ల్యాప్‌టాప్ ద్వారా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. మ్యాక్‌బుక్ ఎయిర్ M2 మోడల్‌లో 1080p కెమెరా కూడా ఉంది. 2020 వెర్షన్ 720p కెమెరాతో వస్తుంది. ఈ కొత్త మోడల్‌తో మెరుగైన కెమెరా ఉంది. 2022 మోడల్‌లో స్పీకర్ గ్రిల్స్ లేవు. డిజైన్ కోసం కంపెనీ కీబోర్డ్, డిస్‌ప్లే మధ్య రెండు ట్వీటర్‌లు, రెండు వూఫర్‌లను ఉంచింది. కంపెనీ డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో పాటు స్పేషియల్ ఆడియో టెక్‌కి సపోర్టు అందిస్తుంది. MacBook Air M2 పాత వెర్షన్ కంటే మెరుగైన ఎంపికగా చెప్పవచ్చు. ఈ కొత్త ల్యాప్‌టాప్ చాలా ఖరీదైనది కూడా. తక్కువ ధరకే పొందాలంటే ప్రీ-ఆర్డర్ ఆఫర్ ఇప్పటికీ ఆన్‌లైన్‌లో ఉంది. డిస్కౌంట్ ధరకే పొందవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 6,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది. యూజర్లు MacBook Air M2ని రూ. 1,13,900 ధర నుంచి రూ. 1,19,900 వరకు పొందవచ్చు. ఈ డిస్కౌంట్ ఆఫర్ ఎప్పటివరకూ అందుబాటులో ఉంటుందో క్లారిటీ లేదు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఛానెల్‌ల ద్వారా కొన్ని ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి, MacBook Air M1 మోడల్ ప్రస్తుతం భారత మార్కెట్లో రూ.96,990 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.

Post a Comment

0 Comments

Close Menu