Ad Code

జూలై 23 నుండి 27 వరకు ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ !


ఫ్లిప్కార్ట్  'బిగ్ సేవింగ్ డేస్' సేల్ ప్రకటించింది. ఈ సేల్ జూలై 23 నుండి ప్రారంభమవుతుంది మరియు జూలై 27వ తేదీ వరకు కొనసాగుతుంది. ఎప్పటిలాగానే ఫ్లిప్కార్ట్ ఈ సేల్ నుండి భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ అందించిన మైక్రో సైట్ పేజ్ ద్వారా డీల్స్ మరియు ఆఫర్ల వివరాలను కూడా వెల్లడించింది. ముఖ్యంగా, బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి ఎలక్ట్రానిక్స్ పైన గరిష్టంగా 80% వరకూ భారీ డిస్కౌంట్ ను అఫర్ చేయనున్నట్లు తెలిపింది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను Axis, Citi మరియు Kotak బ్యాంక్ భాగస్వామ్యంతో తీసుకువస్తోంది. అందుకే, ఈ మూడు బ్యాంక్స్ కార్డ్స్ తో ప్రోడక్ట్ లను కొనుగోలు చేసే వారికి జనరల్ డిస్కౌంట్ తో పాటుగా 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ సేల్ నుండి స్మార్ట్ టీవీలు మరియు అప్లయన్సెస్ పైన 70% వరకూ భారీ డిస్కౌంట్ ను అఫర్ చేయబోతున్నట్లు ఫ్లిప్కార్ట్ టీజింగ్ ద్వారా చెబుతోంది. అలాగే, స్మార్ట్ వాచ్ లను గరిష్టంగా 60% డిస్కౌంట్ తో, ల్యాప్ టాప్ ల పైన కూడా గరిష్టంగా 40% వరకూ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. కొనుగోలుదారులు ఎక్కువగా లాభాలను అందుకునే ఇతర ఆఫర్ల గురించి చూస్తే, స్మార్ట్ ఫోన్స్, అప్లయన్సెస్ మరియు ఫ్యాషన్స్ పైన మంచి డిస్కౌంట్ అఫర్ చేయనున్నట్లు ఫ్లిప్కార్ట్ చెబుతోంది. ఈ డీల్స్ కాకుండా క్రేజీ డీల్స్, రష్ అవర్స్, tick tock డీల్స్ మరియు మరిన్ని ఆఫర్లను కూడా అందించనున్నట్లు వెల్లడించింది.

Post a Comment

0 Comments

Close Menu