Ad Code

వి25 సిరీస్ మొబైల్స్‌ ఆగస్టులో విడుదల ?


ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ వివో, వివో వి25 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ల విడుదలకు ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. లాంచ్‌కు సంబంధించి ఇప్పటి వరకైతే కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ ఈ హ్యాండ్‌సెట్ గ్రీక్ బెంచ్ మార్కింగ్ సైట్‌లో కనిపించడం విశేషం. ఈ తాజా పరిణామం ప్రకారం చూస్తుంటే.. కొత్త  వి సిరీస్ ఫోన్ త్వరలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలియజేస్తోంది. కాగా, ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల విషయాన్ని పక్కన పెడితే.. లాంచ్‌కు ముందే ఇది పలు ప్లాట్‌ఫాంలలో ఇప్పటికే వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలె ఆ Vivo V25 ప్రో స్మార్ట్‌ఫోన్ కు సంబంధించి భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ ఫొటో విడుదల చేయడంతో అది వైరల్‌గా మారింది. దీంతో ఆయన అభిమానులు, టెక్ ప్రియులు కూడా ఆ మొబైల్ లాంచ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ Vivo V25 స్మార్ట్‌ఫోన్ 8GB RAMతో పాటు ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 900 SoC ప్రాసెసర్‌తో వస్తుందని తెలుస్తోంది. Geekbench లిస్టింగ్‌లో తెలిసిన వివరాల ప్రకారం.. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుందని సమాచారం. గీక్‌బెంచ్‌లో సింగిల్-కోర్ టెస్టింగ్‌లో ఈ హ్యాండ్‌సెట్ 700 పాయింట్లు మరియు మల్టీ-కోర్ టెస్టింగ్‌లో 1,997 పాయింట్లను స్కోర్ చేసింది. ఆన్‌లైన్ లో పలు మీడియా వర్గాల నుంచి ఈ మొబైల్‌కు సంబంధించి విడుదల తేదీ లీకులు వచ్చాయి. స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్ట్ 17 లేదా ఆగస్టు 18న ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు లీకుల సమాచారం. ఇది 8GB RAM కెపాసిటీ మరియు 128GB | 256GB రెండు స్టోరేజీ ఎంపికలలో వస్తుంది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లను బట్టి చూస్తే భారత్‌లో ఈ మొబైల్ ధర దాదాపు రూ.30 వేల నుంచి రూ.35వేల వరకు ఉంటుందని అంచనా. ఇది డైమండ్ బ్లాక్‌, సన్‌రైస్ గోల్డ్ కలర్లలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఈ మోడల్‌కు సంబంధించి ఇటీవల లీకైన స్పెసిఫిషన్లను చూస్తే.. ఈ మొబైల్ కు 6.62 అంగుళాల full-HD + AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే అత్యధికంగా 90Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఓఎస్‌పై పని చేస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 900 SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది. 8GB RAM| 128GB స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉంది. ఇక కెమెరాల విషయానికొస్తే.. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు ఎల్ఈడీ ఫ్లాష్‌ కలిగి ఉంది. ఈ ఫోన్‌కు 50 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్రధాన కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మరో రెండింటిలో 12 మెగాపిక్సెల్‌తో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌, 2 మెగా పిక్సెల్ క్వాలిటీలో మాక్రో లెన్స్ ఇస్తున్నారు. సెల్ఫీ మరియు వీడియో కాల్ కోసం ముందు వైపు 16 మెగా పిక్సెల్ క్వాలిటీతో హై రిసోల్యూషన్ ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు. ఛార్జ్‌ విషయానికొస్తే 4500mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. 44W or 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా, డ్యూయల్-సిమ్ స్లాట్‌లు, 5G ​​సపోర్ట్, Wi-Fi, USB టైప్-C పోర్ట్ సహా పలు ఫీచర్లను కలిగి ఉండనుందని తెలుస్తోంది. ఈ కొత్త డివైజ్ OnePlus 10R మరియు Realme GT నియో 3 వంటి వాటితో పోటీపడుతుందని భావిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu