Ad Code

దేశీయ మార్కెట్లోకి రెడ్ మీ కే50ఐ !


దేశీయ మార్కెట్లోకి Xiaomi కంపెనీ భారత్‌లో కే సీరీస్ మొబైల్స్‌ను మళ్లీ ప్రారంభించింది. రెడ్ మీ కే50ఐ స్మార్ట్‌ఫోన్ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దాంతో పాటుగా రెడ్ మీ బడ్స్ 3 లైట్ టిడబ్ల్యూఎస్  ఇయర్‌ఫోన్స్ ను కూడా బుధవారం విడుదల చేసింది. ఈ మొబైల్ వేపర్ కూలింగ్ చాంబర్‌ ఆధారిత octa-core MediaTek Dimensity 8100 SoC ప్రాసెసర్‌తో వస్తోంది. దీని డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్‌రేటుతో పనిచేస్తుంది. ఈ మొబైల్ కు 6.6 అంగుళాల full-HD + (1,080x2,460 pixels) LCD డిస్‌ప్లే పానెల్‌ను అందిస్తున్నారు. ఇది 144Hz రిఫ్రెష్ రేటుతో పని చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ octa-core MediaTek Dimensity 8100 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ మొబైల్ IP53 వాటర్ లేదా డస్ట్ రెసిస్టాన్స్ రేటింగ్‌ ఫీచర్తో వస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 12 ఓఎస్ సహకారంతో పనిచేస్తుంది. ఇది ర్యామ్ కెపాసిటీ ఆధారంగా రెండు వేరియంట్లలో లభిస్తోంది. 6GB RAM + 128GB | 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తోంది. ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన కెమెరా 64 మెగాపిక్సల్ క్వాలిటీలో Samsung ISOCELL GW1 లెన్స్ కలిగి ఉంది. మరో రెండు కెమెరాలు 8 మెగాపిక్సెల్‌ (అల్ట్రా వైడ్ లెన్స్‌), 2 మెగాపిక్సెల్ క్వాలిటీ (మాక్రో లెన్స్‌)ని కలిగి ఉన్నాయి. ఈ మొబైల్‌కు ఫ్రంట్ సైడ్ వీడియో కాలింగ్ కోసం 16 మెగా పిక్సెల్ క్వాలిటీతో సెల్ఫీ కెమెరా అందిస్తున్నారు. ఇక ఛార్జ్‌ విషయానికొస్తే 5080 mAh సామర్థ్యం గల బ్యాటరీ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ డ్యుయల్ సిమ్ స్లాట్స్‌, రెండిటికీ 5జీ నెట్‌వర్క్ సపోర్ట్ సిస్టమ్ కలిగి ఉంది. 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.3 ఫీచర్లను కలిగి ఉంది. రెడ్ మీ కే50ఐ బేస్ వేరియంట్ 6GB RAM + 128GB ధర రూ.25,999 గా నిర్ణయించారు. మరో వేరియంట్ 8GB RAM + 256GB ధర రూ.28,999 గా నిర్ణయించారు. ఈ మొబైల్ క్విక్ సిల్వర్‌, ఫాంటం బ్లూ, స్టెల్త్ బ్లాక్ కలర్లలో ఇది అందుబాటులో ఉంది. జులై 23 వ తేదీ నుంచి ఈ మొబైల్ కొనుగోలు దారులకు అందుబాటులోకి వస్తుంది. అమెజాన్ ద్వారా లేదా ఎంఐ స్టోర్‌, అధికారిక వెబ్‌సైట్, రిటైల్ స్టోర్లలో వీటిని కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ కార్డుదారులకు ఈ మొబైల్ కొనుగోలు పై రూ.3వేల డిస్కౌంట్ లభించనుంది. అంతేకాకుండా రూ.2,500 వరకు ఎక్స్చేంజీ బోనస్ పొందవచ్చు. ఇది ఈ ఏడాది ప్రారంభంలో చైనాలో విడుదలైన Redmi Note 11T Pro కు రిబ్రాండెడ్ వర్షన్‌గా కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu