శాంసంగ్ స్టూడెంట్ అడ్వాంటేజ్ ప్రోగ్రామ్‌ !
Your Responsive Ads code (Google Ads)

శాంసంగ్ స్టూడెంట్ అడ్వాంటేజ్ ప్రోగ్రామ్‌ !


దేశం లోని విద్యార్థులకు శాంసంగ్ కంపెనీ శుభవార్త చెప్పింది. విద్యార్థులకు ఉపయోగపడే గ్యాడ్జెట్స్‌ను డిస్కౌంట్ ధరలో అందించే విధంగా ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్‌కు స్టూడెంట్ అడ్వాంటేజ్ ప్రోగ్రామ్‌ గా పేరు పెట్టింది. ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్న ఈ స్కీమ్ ప్రస్తుతం కంపెనీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ మరియు ఎక్స్‌క్లూజివ్ శాంసంగ్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది. విద్యార్థుల రోజువారీ ఉపయోగం కోసం కొత్త సాంకేతికతను అందించడమే లక్ష్యంగా ఈ ఆఫర్ అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా, విద్యార్థుల్లో డిజిటల్ లెర్నింగ్ పై మరింత ప్రోత్సహించి, అవగాహన కల్పించి వారిని శక్తివంతం చేయడానికి ఈ ప్రోగ్రామ్ రూపొందించబడినట్లు కంపెనీ పేర్కొంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా, శాంసంగ్ విద్యార్థులకు కొనుగోలు చేసే ప్రక్రియను చాలా చాలా సౌకర్యవంతంగా చేస్తుంది. అంతేకాకుండా కొనుగోలు మరియు అమ్మకాల తర్వాత ఎండ్ టూ ఎండ్ సేవలను మరింత మెరుగ్గా అందిస్తుంది. భారత్‌ను శక్తివంతమైన డిజిటల్ ఇండియాగా మార్చాలని సామ్‌సంగ్ కు ఉన్న పట్టుదలను ఈ ప్రాజెక్ట్ మరింత బలోపేతం చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ స్టూడెంట్ అడ్వాంటేజ్ ప్రోగ్రామ్‌ ద్వారా దేశ వ్యాప్తంగా యంగ్ జనరేషన్‌కు సామ్‌సంగ్‌ కంపెనీకి చెందిన ప్రీమియం టెక్నాలజీ ఉత్పత్తుల్ని దగ్గర చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా సామ్‌సంగ్ కంపెనీకి చెందిన Galaxy S20 FE and Galaxy S21 FE, the Galaxy A series, Galaxy Tab A series and Galaxy Tab S series ఫ్లాగ్‌షిప్ డివైజుల్ని 5శాతం డిస్కౌంట్ రేట్‌తో కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా వేరబుల్స్, ల్యాప్‌టాప్‌ ఉత్పత్తులపై విద్యార్థులు 10శాతం వరకు డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఇక సామ్‌సంగ్ మానిటర్ల విషయానికి వస్తే 5 శాతం డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. Galaxy S22 Ultra ని కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు.. Galaxy Watch 4ని రూ.2,999 కు పొందవచ్చు. అంతేకాకుండా, Samsung Finance+ లేదా HDFC బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించి కొనుగోలు చేసినపుడు అప్‌గ్రేడ్ బోనస్ కింద రూ. 8,000 లేదా క్యాష్‌బ్యాక్ రూ.5 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా వినియోగదారులు 5% తగ్గింపుతో పాటు జీరో డౌన్ పేమెంట్‌తో 24 నెలల నో-కాస్ట్ EMI చెల్లింపు ఎంపికను కూడా ఎంచుకోవచ్చు. Galaxy S22 మరియు Galaxy S22+ స్మార్ట్‌ఫోన్‌ల గురించి మాట్లాడుతూ, విద్యార్థులు Galaxy Buds 2 ని రూ. 2,999 ని పొందవచ్చని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా పలు కొనుగోళ్లపై అప్‌గ్రేడ్ బోనస్ రూ. 8,000 లేదా క్యాష్‌బ్యాక్ రూ. 5,000 పొందవచ్చని పేర్కొంది. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయని తెలిపింది. వీటితో పాటు నో-కాస్ట్ EMI చెల్లింపు ఎంపిక అలాగే ఉంటాయి. Galaxy A53 5G మరియు Galaxy A33 5G కొనుగోలు చేసే వినియోగదారుల రూ.3 వేల తక్షణ తగ్గింపు ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog