Ad Code

ఆగస్టులో షావోమీ ఎలక్ట్రిక్ కార్ ?


స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో అనేక సంచలనాలు సృష్టించిన షావోమీ, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో తమ సత్తా చూపించబోతోంది. షావోమీ ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి ఇప్పటికే అడుగుపెట్టింది. గతంలో షావోమీ ఎం365 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంఛ్ చేసింది. 2024లో ఎలక్ట్రిక్ కార్ రిలీజ్ చేస్తామని గతేడాదే షావోమీ ప్రకటించింది. షావోమీ నుంచి రాబోయే మొదటి ఎలక్ట్రిక్ కార్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ ఆగస్టులో విడుదల కానుందని తాజాగా వార్తలొస్తున్నాయి. చైనాకు చెందిన ఓ సంస్థ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఆగస్టులో షావోమీ తన తొలి ఎలక్ట్రిక్ కార్ ప్రోటో టైప్‌ను ప్రదర్శించనుంది. చైనాలో పబ్లిక్ ఈవెంట్‌లో షావోమీ ఫౌండర్, సఈఓ లీ జున్ ఎలక్ట్రిక్ కార్ ప్రోటోటైప్‌ను ఆవిష్కరించనున్నారు. స్మార్ట్‌ఫోన్లకు ప్రసిద్ధి చెందిన చైనీస్ టెక్ కంపెనీ గతేడాది సెప్టెంబర్‌లో ఎలక్ట్రిక్ వెహికల్ వెంచర్‌ను అధికారికంగా ప్రకటించింది. మొదట్లోనే 1.5 బిలియన్ డాలర్లను కేటాయించారు. లీ జున్ స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నారు. లీ జున్ స్వయంగా షావోమీ కార్ ప్రాజెక్ట్‌లో చురుగ్గా ఉంటున్నారు. బీజింగ్ సమీపంలోని షావోమీ టెక్నాలజీ పార్కులో షావోమీ ఆటో టీమ్‌తో తన మూడింట రెండు వంతుల సమయం గడుపుతున్నారు. షావోమీ నుంచి తొలి ఎలక్ట్రిక్ కార్ 2024లో లాంఛ్ కానుంది. అయితే ఏ నెలలో రిలీజ్ అవుతుందన్న స్పష్టత లేదు. ప్రోటోటైప్ ఆవిష్కరించిన తర్వాత ఈ ఎలక్ట్రిక్ కార్‌ను టెస్ట్ చేయనుంది. అక్టోబర్ తర్వాత ఎలక్ట్రిక్ కార్ టెస్టింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2024లో కార్ లాంఛ్ చేసిన తర్వాత అదే ఏడాదిలో 1,50,000 ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేయాలన్న లక్ష్యం పెట్టుకుంది షావోమీ. బీజింగ్‌లో సంవత్సరానికి 3,00,000 వాహనాలను తయారు చేయగల పెద్ద ప్లాంట్‌ను షావోమీ నిర్మిస్తోంది. నాలుగు ఎలక్ట్రిక్ కార్ మోడళ్లను తీసుకురానుంది. షావోమీ ఎలక్ట్రిక్ వెహికిల్ టీమ్‌లో HVST ఆటోమొబైల్ ఉద్యోగులు ఉన్నారు. గతంలో డబ్ల్యూఎం కోసం మావెన్ కాన్సెప్ట్ కార్ డిజైన్ చేసినవారు ఉన్నారు. షావోమీ ఎలక్ట్రిక్ కార్ డివిజన్ కోసం 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టబోతోంది. వచ్చే 10 ఏళ్లలో కంపెనీ ఈ పెట్టుబడిని పెట్టనుంది. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లు, టూవీలర్లు, త్రీవీలర్లకు డిమాండ్ కనిపిస్తోంది. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిపెడుతున్నాయి. కొత్త కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌లోకి వస్తున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu