Ad Code

జూన్ నెలలో రికార్డ్ నమోదు చేసిన కియా కార్ల అమ్మకాలు !


' కియా ' ఇండియాలో ఈ ఏడాది తొలి అర్థభాగంతో పాటు జూన్ నెలలో రికార్డ్ స్థాయిలో అమ్మకాలను నమోదు చేసిందని కియా ఇండియా ప్రకటించింది. జూన్ నెలలో ఏకంగా 24,024 యూనిట్ల కార్లను విక్రయించింది. 2021లో ఇదే నెలలో 15,015 కార్లను విక్రయించింది. గతేడాదితో పోలిస్తే దాదాపుగా 10 వేల యూనిట్లను అదనంగా విక్రయించింది. దాదాపు 60 శాతం గ్రోత్ నమోదు చేసింది. కియా కాంపాక్ట్ ఎస్ యూ వీ సెల్టోస్ కార్ అన్నింటి కన్నా ఎక్కువగా అమ్ముడుపోయింది. ఏకంగా 8388 యూనిట్ల విక్రయం జరిగింది. ఆ తరువాతి స్థానాల్లో కారెన్స్ 7895 యూనిట్లతో, సబ్ కాంపాక్ట్ ఎస్ యూ వీ సోనెట్ 7455 యూనిట్లతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి.  ఏడాది తొలి భాగంలో 26 శాతం గ్రోత్ నమోదు చేసింది. వీటిలో కియా సెల్టోస్ 48320 యూనిట్లు, సోనెట్ 40,687 యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా సప్లై చైన్ సమస్యలు ఉన్నప్పటికీ మేము ఈ రికార్డును సాధించామని కియా ఇండియా వైస్ ప్రెసిడెండ్ హర్దీప్ సింగ్ బ్రార్ అన్నారు. మా మోడల్స్ పై వినియోగదారులు నమ్మకం పెట్టుకున్నారని.. వెయిటింగ్ పిరియడ్ ఎక్కువగా ఉన్నా.. వీలైనంత త్వరగా మా కస్టమర్లకు కార్లను డెలివరీ చేస్తున్నామని వెల్లడించారు. కియా తాజాగా ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి ప్రవేశించింది. తాజాగా తన కొత్త మోడల్ ఈవీ 6 కార్ ను మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈవీ 6 కార్ బుకింగ్స్ కూడా పెరుగుతున్నాయి. దాదాపుగా 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుండటంతో దీన్ని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ ఏడాది కేవలం 100 యూనిట్లను మాత్రమే విక్రయించనుంది. సెప్టెంబర్ నెలలో డెలవరీ ప్రారంభిస్తామని కియా వెల్లడించింది.

Post a Comment

0 Comments

Close Menu