Ad Code

స్పేస్‌లో 'సిటీ' సృష్టించబోతున్న జపాన్ ?


మూన్‌, మార్స్‌ల పైన ప్రత్యేకంగా రూపొందించిన నివాసయోగ్యమైన జోన్‌లలో భూమిపైన ఉన్న వాతావరణం లాంటి కృత్రిమ అంతరిక్ష వాతావరణాన్ని రూపొందించాలని జపాన్‌కు చెందిన క్యోటో విశ్వవిద్యాలయం, కజిమా కన్‌స్ట్రక్షన్‌ల పరిశోధకులు యోచిస్తున్నారు. దీనితో పాటు అక్కడ ప్రయాణించడానికి బుల్లెట్ రైళ్లను వినియోగించాలని, ఆ కాన్సెప్ట్ పైన కూడా పనిచేస్తున్నారు. దీని కోసం 'హెక్సాగాన్ స్పేస్ ట్రాక్ సిస్టమ్' పేరుతో రవాణా వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. నిజానికి, ఇతర దేశాల అంతరిక్ష అభివృద్ధి ప్లాన్‌లల్లో ఇలాంటి ప్రణాళిక లేకపోవడం విశేషం. ఇక, "భవిష్యత్తులో మానవులు అంతరిక్షంలోకి వెళ్లేలా చేయడంలో కీలకమైన ముఖ్యమైన టెక్నాలజీని మా ప్లాన్‌ సూచిస్తుంది" అని క్యోటో యూనివర్సిటీకి చెందిన ఎస్ఐసి  హ్యూమన్ స్పేస్‌లజీ సెంటర్ డైరెక్టర్ యోసుకే యమషికి ఇటీవల విలేకరుల సమావేశంలో చెప్పారు. ఈ ప్రాజెక్ట్ 2050 నాటికి పూర్తవుతుందని పరిశోధకులు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu