Ad Code

ట్రాక్టర్ కి ఎగ్జాస్ట్ పైప్ వెనుకాల ఎందుకు ఉండదు ?


ట్రాక్టర్లను ఏదైనా పెద్ద స్థలంలో పనిచేసేటప్పుడు వాడుతారు. ముఖ్యంగా ట్రాక్టర్లను వ్యవసాయంలో ఎక్కువగా వాడతారు. మన దేశంలో ట్రాక్టర్లను రైతులే ఎక్కువగా వాడుతారు. ట్రాక్టర్లు ఒక మనిషి చేసే పనిని ఎంతో సులువుగా చేస్తాయి. రైతులు పొలాల్లో ఎక్కువగా శ్రమ పడకుండా ఈ ట్రాక్టర్లు ఎంతగానో సహాయపడుతున్నాయి. అయితే ట్రాక్టర్ కు ఎగ్జాస్ట్ పైప్ ముందు ఉంటుంది. కారు వంటి ఇతర వాహనాల్లో అయితే ఎగ్జాస్ట్ పైప్ వెనకాల ఉంటుంది. ట్రాక్టర్ కు మాత్రమే ఎందుకు ముందు ఉంటుందో చాలామందికి తెలియదు. ఇలా ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ట్రాక్టర్లు వరి నారు వేసేటప్పుడు బురద మట్టిలో పనిచేస్తాయి. పొలంలో నీళ్లు ఉన్నప్పుడు ట్రాక్టర్లు పనిచేయడం వలన పొలాల్లోని నీరు ఎగ్జాస్ట్ పైపులోకి వెళ్లే అవకాశం ఉంటుంది. దీని వలన ఇంజన్ పాడవడం వంటి సమస్యలు వస్తాయి. అందుకనే ట్రాక్టర్లకు ఎగ్జాస్ట్ పైప్ ముందు ఉంటుంది. అలాగే ట్రాక్టర్ కు ఎగ్జాస్ట్ పైప్ వెనకాల ఉండేలా చేయడం కన్నా ఇంజన్ ఉన్నచోట పెడితే సులభం అవుతుంది. ఎందుకంటే పైప్ వర్క్ తక్కువగా ఉంటుంది. అలాగే మెయిన్టెనెన్స్ ఖర్చు కూడా తగ్గుతుంది. అలాగే ట్రాక్టర్ ను ఎక్కువగా పొలం పనులకు ఉపయోగిస్తారు. ఎగ్జాస్ట్ పైప్ వెనుకాల ఉంటే అందులో నుండి వచ్చే పొగ పంటలకి హాని చేస్తుంది. అందుకనే ఎగ్జాస్ట్ పైప్ ట్రాక్టర్ ముందు ఉంటుంది. సాధారణం గా ట్రాక్టర్ ని రెండు భాగాలుగా వేరు చేయవచ్చు. రెండవ భాగం అప్పుడప్పుడు రిపేర్ చేయవలసి వస్తుంది. ఒకవేళ ఎగ్జాస్టింగ్ పైప్ వెనకాల ఉంటే ఎప్పుడైనా ఏదైనా రిపేర్ వస్తే చేయడం చాలా కష్టం. కొన్నిసార్లు ఎగ్జాస్టింగ్ పైప్ చివర కర్వ్ తిరిగి ఉంటుంది. లేదా ఒక ప్లాఫ్ కవర్ ఉంటుంది. దీని వలన ఎగ్జాస్ట్ పైప్ ఉపయోగించినప్పుడు వర్షపు నీళ్ళు లేదా వేరే ఏమైనా పైప్ లోపలికి పోకుండా ఉంటాయి. ఈ కారణాల చేత ఎగ్జాస్ట్ పైప్ ట్రాక్టర్ ముందు భాగానే ఉంటుంది. ఇలా ఉంటేనే సేఫ్.

Post a Comment

0 Comments

Close Menu