Ad Code

ఎయిర్‌టెల్‌లో గూగుల్ పెట్టుబడులు !


దేశంలో రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన భారతి ఎయిర్‌టెల్ కంపెనీ గూగుల్ నుండి $1 బిలియన్ పెట్టుబడిని పొందుతున్నట్లు ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రకటించింది. గూగుల్ సంస్థ $1 బిలియన్‌ పెట్టుబడిలో $700 మిలియన్లను టెల్కోలోని 1.28% వాటా పెట్టుబడి కోసం వినియోగించబడింది. మిగిలిన $300 మిలియన్ల మొత్తాన్ని  రాబోయే సంవత్సరాలలో అనేక ఒప్పందాలను రూపొందించడం కోసం ఉద్దేశించబడనున్నట్లు ప్రకటించింది. గూగుల్  ఎయిర్‌టెల్‌లో పెట్టుబడులను పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం భారతదేశంలో నిర్దిష్ట 5G వినియోగ సామర్ధ్యంను మెరుగ్గా సృష్టించడం. కంపెనీల మధ్య జరిగిన ఒప్పందాన్ని టెల్కో వాటాదారులు అందరూ ఆమోదం తెలిపారు. భారతీ ఎయిర్‌టెల్‌ టెలికాం సంస్థలో $700 మిలియన్ల (రూ. 52,243.80 మిలియన్లు) గూగుల్ పెట్టుబడికి జూన్ 30, 2022న CCI నుండి గ్రీన్ లైట్ పొందినట్లు తెలిపింది. రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరును రూ.734 చొప్పున మొత్తంగా 71,176,839 ఈక్విటీ షేర్లను ఎయిర్‌టెల్ సంస్థ గూగుల్‌కు జారీ చేయనున్నది. అంటే ఇప్పుడు భారతీ ఎయిర్‌టెల్‌లో గూగుల్ 1.28% వాటాను కలిగి ఉంటుంది. రిలయన్స్ జియోలో కూడా గూగుల్ సంస్థ వాటాను కొనుగోలు చేసి సన్నిహితంగా పని చేస్తోంది. అయితే ఎయిర్‌టెల్ మరియు గూగుల్‌ సంస్థల ఒప్పందంలో ఎలాంటి వివాదాస్పద ప్రయోజనాలకు తావు ఉండదని భారతీ ఎయిర్‌టెల్ సీఈఓ గోపాల్ విట్టల్ గతంలోనే తెలిపారు. ఎయిర్‌టెల్ మరియు గూగుల్ మధ్య ఉన్న ఒప్పందం గూగుల్ మరియు జియో మధ్య ఉన్నదాని కంటే భిన్నమైనదని విట్టల్ స్పష్టం చేశారు. గూగుల్, ఎయిర్‌టెల్ సంస్థలు రెండు కూడా భవిష్యత్తులో మరిన్ని బహుళ వాణిజ్య ఒప్పందాలను ఏర్పరచుకోవాలని చూస్తున్నాయి. ఇది సెర్చ్-ఇంజిన్ దిగ్గజం గూగుల్ సంస్థతో జియో టెల్కో చేయాలనుకుంటున్న దానికి భిన్నంగా ఉంటుంది. గూగుల్ తో జరిగే కొత్త ఒప్పందాలు ముందు ముందు భారతీ ఎయిర్‌టెల్‌కు పెద్ద విజయాలను అందించడంలో సహాయపడతాయి. నాలుగు సంవత్సరాల పాటు FY2018-19 వరకు అదనపు AGR (సర్దుబాటు చేసిన స్థూల రాబడి) బకాయిల వాయిదాను ప్రకటించడం ద్వారా ఎయిర్‌టెల్ ఆదా చేసే వేల కోట్లతో పాటు ఈ డబ్బు కూడా జియోకి వ్యతిరేకంగా ఎయిర్‌టెల్‌ను చాలా బలమైన స్థితిలో ఉంచుతుంది. 5G యుగంలో అధిక మంది కస్టమర్లను పొందడం కోసం ఎయిర్టెల్ మరియు జియో టెల్కోల మధ్య మళ్ళి యుద్ధం ప్రారంభం కానున్నది. అయితే ఇండియాలో ఈసారి జియోకి సమాన పోటీదారుగా ఎయిర్‌టెల్ ఉంటుంది అని కొన్ని నిఘా వర్గాలు సూచిస్తున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu