వివో ఇండియా డైరక్టర్లు జెంగ్‌షెన్ ఓయూ, ఝంగ్ జీ ఈడీ తనిఖీలకు భయపడి ఇండియా వదిలి పారిపోయినట్లు తెలుస్తుంది. మనీలాండరింగ్ కేసులో విచారణ జరగాల్సి ఉండగా కేసుకు సంబంధించిన 40లొకేషన్లలో ఏజెన్సీ తనిఖీలు జరపడంతో పరారయ్యారు. వీవో మొబైల్ కమ్యూనికేషన్స్, ఇతర చైనా కంపెనీలపై ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లతో పాటు కొన్ని దక్షిణాది రాష్ట్రాలలోని 40ప్రదేశాలలో ఫెడరల్ ఏజెన్సీ తనిఖీలు నిర్వహించారు. కేసుపై ప్రస్తుతం సీబీఐ ఇన్వెస్టిగేషన్ జరుపుతుంది. ఐటీ డిపార్ట్‌మెంట్ సైతం చైనా కంపెనీలపై నిఘా ఉంచింది. మనీ లాండరింగ్ చట్ట ప్రకారం.. ఈడీ ఈ దర్యాప్తు జరుపుతుందని అధికారులు పేర్కొన్నారు. వీవో కంపెనీపై ఇతర చైనా కంపెనీలతో ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కార్పొరేట్ వ్యవహరాల శాఖ దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టి మోసాలను బయటకు తీయాలని అనుకుంది.
ఈడీకి భయపడి వివో డైరక్టర్లు పరార్ ?
0
July 07, 2022