Ad Code

ఫైర్ - బోల్ట్ విషనరీ స్మార్ట్ విడుదల


ఫైర్ - బోల్ట్ సరికొత్త మోడల్ ఫైర్ - బోల్ట్ విషనరీ స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. ఈ వాచ్ అద్భుతమైన హెల్త్ ఫీచర్లను కలిగి ఉంది. రీఛార్జబుల్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఒకసారి ఛార్జ్ చేయడం ద్వారా ఐదు రోజుల పాటు వాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ వాచ్ లో బ్లూటూత్ కాలింగ్ సౌకర్యం వుంది. ఇది 368x448 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.79-అంగుళాల రెక్టాంగ్యులర్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. నావిగేషన్ కోసం దీనికి కుడి వైపున ఒక బటన్ అందిస్తున్నారు. ఇది హార్ట్ బీటింగ్ రేట్ (హృదయ స్పందనల) మానిటరింగ్ సెన్సార్‌తో పాటుగా SpO2 బ్లడ్ ఆక్సిజన్‌,హెల్త్ ట్రాకర్ సదుపాయాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా స్లీప్ మానిటరింగ్ ఫీచర్‌ను కూడా ఈ బ్యాండ్ కలిగి ఉంది. ఈ వాచ్ 100 స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంటుంది. స్ట్రెస్ మానిటరింగ్‌, స్టెప్స్ ట్రాకింగ్ ఫీచర్‌లను కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా కాల్ రిజెక్షన్‌, ఫైండ్ మై ఫోన్‌, మ్యూజిక్‌, కెమెరా కంట్రోల్ సహా పలు ఫీచర్లు ఈ వాచ్‌కు అందిస్తున్నారు. ఇది ఒకసారి ఫుల్ చార్జ్ చేయడం ద్వారా 5 రోజుల పాటు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఇది IP68-రేటెడ్ రెసిస్టెన్స్‌ను అందిస్తుంది. ఏఐ వాయిస్ అసిస్టాన్స్‌, పెడో మీటర్, స్మార్ట్ నోటిఫికేషన్స్, డిస్టాన్స్ ట్రాకర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. స్మార్ట్‌వాచ్ కాల్స్‌ చేసేటప్పుడు మరియు స్వీకరించేటప్పుడు TWSతో కనెక్ట్ అయ్యే సామర్థ్యం కూడా కలిగి ఉంది.


Post a Comment

0 Comments

Close Menu