ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో ఎన్‌పీటీఈఎల్ ప్లాట్‌ఫాంపై విద్యార్ధులకు 12 వారాల ఉచిత ఆన్‌లైన్ కోర్సును ఐఐటీ పలక్కాడ్ ఆఫర్ చేస్తోంది. అప్లైడ్ యాక్లెరేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో ఈ కోర్సును అందిస్తోంది. స్మార్ట్ సిటీ, హెల్త్‌కేర్ రంగాల్లో ఏఐ ఆధారిత సొల్యూషన్స్‌ను పరిశ్రమకు ఎలా అందించాలనే దానిపై బేసిక్స్‌ను ఈ కోర్సులో భాగంగా విద్యార్ధులకు శిక్షణ ఇస్తారు. మెషీన్ లెర్నింగ్, ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పనిచేస్తున్న కంపెనీల నుంచి కూడా విద్యార్ధులకు సహకారం లభిస్తుంది. సైన్స్, ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ స్కాలర్స్, పీజీ విద్యార్ధులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఐఐటీ పలక్కాడ్ ఆఫర్ చేసే ఉచిత ఆన్‌లైన్ ఏఐ కోర్సు ఉపయుక్తంగా ఉంటుంది. ఏఐలో శిక్షణ పొందే విద్యార్ధులకు కంప్యూటర్ ఆర్గనైజేషన్‌లో పనిచేసిన అనుభవం, మెరుగైన కంప్యూటింగ్ నైపుణ్యాలు, మెషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్‌పై అవగాహన ఉండాలి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఫ్రీ ఆన్‌లైన్ కోర్స్ !
0
July 20, 2022
Tags