Ad Code

వాట్సాప్‌ను డిసేబుల్ చేసే విధానం !


అత్యంత ప్రజాదరణపొందిన మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ ఒకటి. రోజూ బిలియన్ల కొద్దీ మెసేజ్‌లు ఇందులో షేర్ అవుతూ ఉంటాయి. ఈ యాప్‌ను డిసేబుల్ చేసినా మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి. వాట్సాప్ బ్యాక్‌గ్రౌండ్ డేటాను ఆఫ్ చేసినా, వాట్సాప్‌ను క్లోజ్ చేసినా వాట్సాప్ మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి. నోటిఫికేషన్స్ కూడా ఆగవు. వాట్సాప్‌ను అన్ఇన్‌స్టాల్ చేయకుండా డిసేబుల్ ఎలా చేయాలో చూడండి. వాట్సాప్ యాప్‌పై ఎక్కువసేపు నొక్కి పట్టండి.. ‘యాప్ ఇన్‌ఫో’ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేయండి. ఇప్పుడు టాప్‌లో ‘ఫోర్స్ స్టాప్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై నొక్కండి. బ్యాక్‌గ్రౌండ్‌లో ‘వాట్సాప్ యాప్‌’ను క్లోజ్ చేయండి. ఇది పూర్తవగానే ఇకపై ఈ యాప్‌లో మెసేజెస్ ఆగిపోతాయి. ఇది పూర్తయిన తర్వాత, మీరు ఈ యాప్‌లో సందేశాలను స్వీకరించడం ఆపివేస్తారు. అయితే మీరు వాట్సాప్‌ను ఓపెన్ చేస్తే అది మళ్లీ పని చేయడం ప్రారంభిస్తుంది. మెసేజెస్ వస్తాయి. మీరు యాప్‌ను మళ్లీ డిసేబుల్ చేయాలనుకుంటే ‘ఫోర్స్ స్టాప్’ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. 


Post a Comment

0 Comments

Close Menu