Ad Code

స్ట్రీట్‌ వ్యూపై ఎన్నో అనుమాలు !


గూగుల్ స్ట్రీట్‌ వ్యూ ఫీచర్‌ను ప్రారంభించడం కొత్తేమీ కాదు. గతంలోనూ గూగుల్ సంస్థ స్ట్రీట్ వ్యూను తీసుకొచ్చింది. అయితే కొన్ని భద్రతా కారణాలతో అప్పట్లో వాటిపై బ్యాన్‌ విధించింది. మరోసారి గూగుల్ స్ట్రీట్‌ వ్యూ అందుబాటులోకి రావడంతో సెక్యూరిటీ ప్రాంతాల పరిస్థితి ఏంటన్న దానిపై ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. గూగుల్‌ సంస్థ 2011లోనే స్ట్రీట్‌ వ్యూ ఫీచర్‌ను భారత్‌లో ప్రారంభించింది. అప్పట్లో రక్షణ శాఖ వివరాలు ఉగ్రమూకలకు, దేశ వ్యతిరేక శక్తులు సులభంగా చేరే ప్రమాదం ఉందని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో 2016లో స్ట్రీట్‌ వ్యూను అప్పటి కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఆరేళ్ల తర్వాత తిరిగి మళ్లీ ఇప్పుడు స్ట్రీట్ వ్యూ సేవలను ప్రారంభించింది. ఈ సారి కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా టెక్‌ మహింద్రాతో టైఅప్‌ అయ్యింది. వీధుల్లో ఫోటోలను తీసే బాధ్యతను టెక్‌ మహింద్రా చేపట్టింది. స్కార్పియో వాహనాలను కెమెరాలతో రోడ్లపై తిప్పుతూ ఫొటోలను సేకరిస్తోంది. అయితే గూగుల్‌ మ్యాప్స్‌ స్ట్రీట్‌ వ్యూపై గత అనుమానాలే ఇప్పుడూ తలెత్తుతున్నాయి. అయితే గతంలో లాగా ప్రభుత్వ, రక్షణ, మిలిటరీ సంబంధిత ప్రాంతాల్లో స్ట్రీట్‌ వ్యూ అందుబాటులో ఉండదంటోంది గూగుల్. ఇలాంటి హై సెక్కూరిటి ప్రాంతాల భద్రతకు ముప్పు లేకుండా స్ట్రీట్ వ్యూలో కొన్నింటిని మాస్కింగ్ ఏరియాలుగా ఉంటాయని ఐటీ రంగ నిపుణులు చెప్తున్నారు. రక్షణ, మిలటరీ ప్రాంతాల్లో భద్రతకు ముప్పు లేనప్పటికీ కాలనీల్లో మాత్రం ఇది కాస్తాంత ఇబ్బందికర పరిస్థితే. ఎందుకంటే కాలనీల్లో ఉండే ఇళ్లు, ఆ కాలనీకి సంబంధించిన వ్యూ క్లియర్‌గా కనిపిస్తుంది. ఇంటి గేటు ఎంత ఎత్తుంది..? కిటికీలు ఎక్కడ ఉన్నాయి..? మెట్లు ఎలా ఉన్నాయన్నది.. స్ట్రీట్‌ వ్యూలో క్లిస్టర్‌ క్లియర్‌గా కనిపిస్తుంది. ఇదే ఇప్పుడు దోపిడీ దొంగలకు వరంగా మారే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దొంగతనం చేసేందుకు చక్కగా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుందని మరికొంతమంది వాదిస్తున్నారు. కాలనీల్లో ఏ ఇళ్లు ఎక్కడ ఉంది? తరచూ సెక్యూరిటీ జోన్‌లేని ఇళ్లను టార్గెట్‌ చేసుకుని దోపిడీకి పాల్పడే అవకాశం లేకపోలేదన్నది కొంతమంది వాదన.మొత్తంమ్మీద నష్టాల సంగతి ఎలా ఉన్నా…. గూగుల్ మ్యాప్స్‌తో తెలియని ప్రాంతాలకు ఈజీగా చేరుకుంటున్న గూగుల్ యూజర్లకు ఇప్పుడు స్ట్రీట్ వ్యూ ఏకంగా ఆ ప్రాంతమే కళ్లముందు కదలాడనుంది.

Post a Comment

0 Comments

Close Menu