Ad Code

త్వరలో గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ ?


దేశంలో స్ట్రీట్‌ వ్యూ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గూగుల్‌ అంతా సిద్ధం చేసింది. ఈ ఫీచర్ ఎనేబుల్ అయితే...ఇంట్లోనే కూర్చుని ల్యాండ్‌మార్క్‌లను వర్చువల్‌గా చూడొచ్చు. రెస్టారెంట్‌లో కూర్చున్న అనుభూతినీ పొందొచ్చు. అంతే కాదు. స్పీడ్‌ లిమిట్స్‌ సహా రోడ్డు ఎక్కడ ఎండ్ అవుతుంది..? ట్రాఫిక్ ఎక్కడ ఎక్కువగా ఉంది అనేది తెలియజేసేలా ట్రాఫిక్ లైట్స్‌ లాంటి ఫీచర్లనూ జోడించనుంది. లోకల్ ట్రాఫిక్ అథారిటీస్‌ భాగస్వామ్యంతో ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయనుంది. డిజిటల్ కన్సల్టెన్సీలో టాప్‌లో ఉన్న టెక్‌ మహీంద్రాతో పాటు మ్యాపింగ్ సొల్యూషన్స్ కంపెనీ జెనెసిస్ ఇంటర్నేషనల్‌తో కలిసి భారత్‌లో స్ట్రీట్‌ వ్యూ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి కొన్ని సిటీల్లో మాత్రమే ఈ స్ట్రీట్‌ వ్యూ ఫీచర్ పని చేయనుంది. బెంగళూరులో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. తరవాత హైదరాబాద్, కలకత్తాలోనూ అందుబాటులోకి వస్తుందని గూగుల్ సంస్థ వెల్లడించింది. క్రమంగా చెన్నై, దిల్లీ, ముంబయి, పుణె, నాసిక్, వడోదర, అహ్మద్‌నగర్, అమృత్‌సర్‌లో ఈ సేవలు విస్తరించనున్నారు. ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేయటం చాలా సులభం అని వివరిస్తోంది గూగుల్. గూగుల్ మ్యాప్స్‌ యాప్ ఓపెన్ చేసి, ఏయే సిటీల్లో అయితే స్ట్రీట్ వ్యూ ఎనేబుల్ అవుతుందో ఆ సిటీలో ఓ ఏరియాను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ చుట్టుపక్కల ఉన్న కేఫ్‌లు, కల్చరల్ హాట్‌స్పాట్‌లు, సహా పరిసరాల్లో ఉన్న అన్ని ఫేమస్ ప్లేసెస్‌ను వర్చువల్‌గా చూడొచ్చు. "స్ట్రీట్ వ్యూతో ప్రపంచాన్ని కొత్తగా చూడొచ్చు. ప్రతి వీధిలోనూ ప్రతి మూలనూ ఎక్స్‌ప్లోర్ చేయటానికి ఇది తోడ్పడుతుంది. ప్రతి ప్రదేశాన్నీ విజువలైజ్ చేసి చూపిస్తుంది. ఫోన్‌ లేదా కంప్యూటర్‌ నుంచి లోకాన్ని కొత్త కోణంలో చూసేందుకు వీలవుతుంది. 2022 ముగిసే నాటికి 50 నగరాలకుపైగా గూగుల్ స్ట్రీట్ వ్యూ అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ ప్రయత్నిస్తోంది. ఇంతే కాదు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌తో కలిసి ఏయే ప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువగా ఉందో తెలియజేయాలని చూస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu