Ad Code

మైక్రో ప్లాస్టిక్ తినే రోబో చేప


మైక్రో ప్లాస్టిక్ ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తున్న అతి పెద్ద సమస్యల్లో ఒకటి. ప్రతి ఒక్కదానిలో మైక్రో ప్లాస్టిక్స్ బయటపడుతున్నాయి. అప్పుడే కురిసిన మంచు, నీళ్లు, మాంసం, పాలు ఇలా దాదాపు ప్రతి దానిలో మైక్రో ప్లాస్టిక్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఎలాగైనా మైక్రో ప్లాస్టిక్‌ను నివారించాలని ప్రపంచం దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. వాటిలో భాగంగా డ్రాగన్ కంట్రీ సరికొత్త రొబొటిక్ చేపను తయారు చేసింది. ఈ చేప నీళ్లలో తిరుగుతూ మైక్రో ప్లాస్టిక్‌ను తినేస్తుంది. అంతేకాకుండా ఈ రోబో గురించి శాస్త్రవేత్తలు మరిన్ని విషయాలు తెలిపారు. ఇది 1.3 సెంటీమీటర్ల పొడవుతో నల్లగా ఉంటుంది. దీనికి ఉండే ఒక లైటు దీనికి కదలడంతో సహాయపడుతుంది. అంతేకాకుండా ఆ లైట్‌తో ఆ రోబ్‌ను కంట్రోల్ చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఒకవేళ ఈ రోబోను ఏదైనా పెద్ద చేప తినేసినా ప్రమాదం ఏమీ ఉండదని, ఈ రోబోట్ చేప పాలియురేతేన్‌తో తయారైందని, దాంతో ఇది వెంటనే జీర్ణం అయిపోతుందని వెల్లడించింది.

Post a Comment

0 Comments

Close Menu