Ad Code

దేశీయ మార్కెట్లోకి కొత్త ఫ్రాన్స్ కంపెనీ కారు విడుదల !


ఫ్రాన్స్ కి చెందిన ఆటోమొబైల్ కంపెనీ సిట్రోయోన్, ఇండియాలో బిజినెస్‌ను క్రమంగా విస్తరిస్తోంది. కొత్త మోడళ్లతో మార్కెట్‌లో పాగా వేయాలని భావిస్తున్న ఈ కంపెనీ తాజాగా మరో మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. 2022 సిట్రోయోన్ C3 కారును జులై 20న విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.5. 70 లక్షలు (ఎక్స్-షోరూమ్). మారుతి సుజుకి ఇగ్నిస్, టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ వంటి సబ్ కాంపాక్ట్ SUVలకు ఈ కారు పోటీ ఇవ్వనుంది. ఫ్రెంచ్ తయారీదారు సిట్రోయెన్ నుంచి C5 ఎయిర్‌క్రాస్ తర్వాత దేశంలో లాంచ్ అయిన రెండో కారు C3 మోడల్. సిట్రోయెన్ C3 కారు మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తుంది. వేరియంట్ వారీగా ఎక్స్-షోరూమ్ ధరలు రూ.8 లక్షల వరకు ఉన్నాయి. సిట్రోయోన్ C3 కారు ఫ్రంట్ స్పోర్ట్స్(Sports).. సిట్రోయెన్ సిగ్నేచర్ గ్రిల్ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్‌లతో ఉంటుంది. ఇది LED DRLలతో అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. ఈ కారు మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ (ఆప్షనల్ ఎక్స్‌ట్రా), చుట్టూ బాడీ క్లాడింగ్‌తో పాటు ముందు వెనుక చంకీ స్కిడ్ ప్లేట్‌లతో వస్తుంది. ఇది 180 mm గ్రౌండ్ క్లియరెన్స్, 315 లీటర్ల బూట్ స్పేస్‌తో కస్టమర్లకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. సిట్రోయోన్ C3 కారు 1.2-లీటర్ 3-సిలిండర్ నేచురల్లీ అస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజిన్ 81 hp పవర్‌ను, 115 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 109 hp పవర్, 190 Nm టార్క్‌ను విడుదల చేసే టర్బోచార్జ్డ్ వెర్షన్ ఇంజిన్‌ను కూడా వినియోగదారులు ఎంచుకోవచ్చు. వీటిలో మొదటిది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో, రెండోది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో లభిస్తుంది. C3 మోడల్‌లో ఇప్పటివరకు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కంపెనీ పరిచయం చేయలేదు. నేచురల్లీ అస్పైర్డ్ ఇంజిన్ ఫ్యుయెల్ కెపాసిటీ 19.8 kpl కాగా, టర్బోచార్జ్డ్ ఇంజిన్‌ మైలేజీ 19.4 kpl వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. సిట్రోయెన్ C3 హై రేంజ్ ఫీచర్లతో వస్తుంది. ఈ కారు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో కూడిన 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్ వీల్‌పై ఆడియో, ఫోన్ కంట్రోల్స్.. నాలుగు స్పీకర్లు.. ముందు, వెనుక USB ఛార్జింగ్ పోర్ట్‌లు.. వంటి ఎన్నో ఫీచర్లతో లభిస్తుంది. డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్లు దీని సొంతం.

Post a Comment

0 Comments

Close Menu