Ad Code

దేశంలో రెట్టింపైన యాపిల్ అమ్మకాలు !


దేశంలో యాపిల్ ఫోన్ అమ్మకాలు భారీగా పెరిగాయి. సైబర్ మీడియా రీసెర్చి (సీఎమ్ఆర్) సంస్థ అంచనా ప్రకారం ఈ ఏడాది రెండో త్రైమాసికంలో యాపిల్ సంస్థ దాదాపు 12 లక్షల ఐఫోన్లు విక్రయించింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే అమ్మకాలు 94 శాతం ఎక్కువ కావడం విశేషం. ఐఫోన్ 12, ఐఫోన్ 13 మోడల్స్ భారీగా అమ్ముడవుతుండటమే దీనికి కారణం. యాపిల్ సంస్థ దేశంలోనే ఫోన్లు తయారు చేస్తుండటం కూడా ఈ విక్రయాలు పెరిగేందుకు ఒక కారణం. తాజాగా అమ్ముడైన ఫోన్లలో 10 లక్షల ఫోన్లు మన దేశంలో తయారైనవే. లేటెస్ట్ ఐఫోన్ మోడల్స్‌లో ఐఫోన్ 12 ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. మొత్తం విక్రయాల్లో వీటి వాటా 41 శాతం. ఆ తర్వాత ఐఫోన్ 13 ఫోన్లు అమ్ముడవుతున్నాయి. వీటి వాటా 32 శాతం. ఆ తర్వాత ఐఫోన్ 11 (17 శాతం), ఐఫోన్ 13 ప్రొ (4శాతం), ఐఫోన్ ప్రొ మ్యాక్స్ (3 శాతం) అమ్ముడవుతున్నాయి. రెండో త్రైమాసికంలో ఐప్యాడ్‌లు కూడా భారీగానే అమ్ముడయ్యాయి. దాదాపు రెండు లక్షల ఐప్యాడ్స్ అమ్ముడయ్యాయి. వీటి అమ్మకాలు కూడా 34 శాతం పెరిగాయి. ఐప్యాడ్స్‌లో ఐప్యాడ్ 9 (వైఫై) ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. తర్వాత ఐప్యాడ్ ఎయిర్ 2022, ఐప్యాడ్ 9 (వైఫై+4జీ) మోడల్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu