Ad Code

ఉద్యోగ నియామకాలను నిలిపేసిన గూగుల్ !


గూగుల్ ఉద్యోగ నియామకాలను తగ్గించింది. 2022లో మిగిలిన 6 నెలల కాలంలో ఉద్యోగ నియామకాలను తగ్గించుకోనుంది. ఈ మేరకు సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ గూగుల్ ఉద్యోగులకు మెమో జారీ చేశారు. గూగుల్ కంపెనీల్లో ఇంజనీర్లు, టెక్నికల్, ఇతర కీలక పోస్టులకు మాత్రమే నియామకాలను చేపట్టనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితుల కారణంగా గూగుల్ ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆదాయ లక్ష్యాలను సాధించడంలో విఫలమైన మెటా ఉద్యోగ నియామకాలను తగ్గించినట్టు ప్రకటించిన వారాల తర్వాత గూగుల్ సీఈఓ పిచాయ్ ఈ మెమోను ఉద్యోగులకు పంపారు. చారిత్రాత్మకంగా, గూగుల్ ఆర్థిక అనిశ్చితి నుంచి సాపేక్షంగా తట్టుకోగలదు. వాస్తవానికి, గూగుల్ సొంత బ్రాండ్ YouTube Q4 2020 – COVID-19 మహమ్మారి మొదటి ఏడాదిలోనూ బాగా పనిచేసింది. యాడ్స్ ద్వారా ఆదాయం త్రైమాసికానికి 46 శాతం పెరిగి $6.9 బిలియన్లకు చేరుకుంది. ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో కంపెనీ సుమారు 10వేల మంది ఉద్యోగులను నియమించుకుందని పిచాయ్ వెల్లడించారు. అదే విషయాన్ని ఆయన మెమోలో తెలిపారు. 2022 మిగిలిన ఏడాదిలో నియామక ప్రక్రియను గూగుల్ నిలిపివేస్తుందని పిచాయ్ తెలిపారు. ఈ ఏడాదిలో సాధారణ నియామకాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. 2022 మిగిలిన భాగం, 2023లో ఇంజనీరింగ్, టెక్నికల్, ఇతర కీలక పోస్టులకు నియామకాలు చేపడతామన్నారు. కంపెనీ వృద్ధి ప్రాధాన్యతలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన ఉద్యోగులను తీసుకుంటామని పిచాయ్ తెలిపారు. ఇప్పటికే గూగుల్ తరహాలో మెటా (ఫేస్ బుక్), స్నాప్ చాట్ కూడా తమ కంపెనీల్లో ఉద్యోగ నియామకాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి.

Post a Comment

0 Comments

Close Menu