Ad Code

ఆగస్టు 10న శాంసంగ్ ఫోల్డబుల్ మొబైల్స్ విడుదల ?


ఆగస్టు 10 వ తేదీన నిర్వహించబోయే గెలాక్సీ అన్‌ప్యాక్‌డ్ ఈవెంట్‌లో శాంసంగ్  Galaxy Z Fold 4 మరియు Galaxy Z Flip 4 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించనుంది. ఈ హ్యాండ్‌సెట్‌ల స్పెసిఫికేషన్‌లు మరియు డిజైన్‌కి సంబంధించిన ఇప్పటికే అనేక పుకార్లు వచ్చాయి. కానీ, Samsung మాత్రం ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారాన్ని వెల్లడించలేదు. తాజాగా, Galaxy Z Flip 4 యొక్క కలర్ వేరియంట్లు, స్టోరేజీ ఆప్షన్లకు సంబంధించి 9టూ5 గూగుల్ నివేదిక పలు వివరాలను వెల్లడించింది. ఈ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 70 కలర్ వేరియంట్లలో లభించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు Samsung కేర్ ప్లస్ అనే కంపెనీ వెబ్‌సైట్‌లో కనుగొన్నట్లు నివేదిక పేర్కొంది. మరోవైపు, ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి కంపెనీ తమ అధికారిక వెబ్‌సైట్లో ప్రీ రిజర్వ్ బుకింగ్స్ ను ఇప్పటికే అందుబాటులో ఉంచింది. ఈ ప్రీ రిజర్వ్ చేసుకున్న వినియోగదారులకు మొబైల్ కొనుగోలుపై అదనంగా రూ.5 వేల వరకు ప్రయోజనాలు ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఇప్పటి వరకు వెలువడిన రూమర్ల ప్రకారం.. Galaxy Z Flip 4 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 128జీబీ, 256జీబీ స్టోరేజీ ఆప్షన్లలో లభిస్తుందని సమాచారం. కానీ, తాజాగా వచ్చిన నివేదికల సమాచారాన్ని బట్టి చూస్తే ఈ మొబైల్ 512జీబీ స్టోరేజీ వేరియంట్‌ను కూడా కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ ఆప్షన్ ఇంకా ఇన్సూరెన్స్ సైట్‌లో పొందుపరచలేదు. అంతేకాకుండా, ఈ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 70 కలర్ వేరియంట్లలో లభించనున్నట్లు తెలుస్తోంది. Galaxy Z Flip 4 మొబైల్ నీలం, బోరా పర్పుల్, గ్రాఫైట్ మరియు పింక్ గోల్డ్ కలర్లలో వస్తున్నట్లు జాబితా చేయబడింది. ఈ కలర్‌ ఎంపికలు ఇటీవల లీక్ అయిన హ్యాండ్‌సెట్ డిజైన్ రెండర్‌లలో కూడా చిత్రీకరించబడ్డాయి. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ (Galaxy Unpacked)ఈవెంట్ ఆగస్టు 10న ఉదయం 9 గంటలకు ET/ IST ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు నిర్వహించబడుతుంది. గెలాక్సీ వాచ్ 5 మరియు గెలాక్సీ బడ్స్ 2 ప్రోతో పాటు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 మరియు గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4లను శాంసంగ్ ఈ ఈవెంట్‌లో ఆవిష్కరించనుంది.

Post a Comment

0 Comments

Close Menu